iDreamPost
android-app
ios-app

KKR కోసం ఈసారి ఎంతో చేయాలనుకున్నా.. రింకూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published May 11, 2024 | 10:07 PM Updated Updated May 11, 2024 | 10:07 PM

కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ ఈసారి ఐపీఎల్​లో పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో భారత టీ20 వరల్డ్ కప్​ మెయిన్ టీమ్​లో అతడికి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో అతడు తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ ఈసారి ఐపీఎల్​లో పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో భారత టీ20 వరల్డ్ కప్​ మెయిన్ టీమ్​లో అతడికి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో అతడు తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published May 11, 2024 | 10:07 PMUpdated May 11, 2024 | 10:07 PM
KKR కోసం ఈసారి ఎంతో చేయాలనుకున్నా.. రింకూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఐపీఎల్-2024లో కోల్​కతా నైట్ రైడర్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆడిన 11 మ్యాచుల్లో 8 విజయాలతో ఆ టీమ్ పాయింట్స్ టేబుల్​లో టాప్​లో ఉంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆ జట్టు ప్లేఆఫ్స్​కు అర్హత సాధించినట్లే. దీంతో కేకేఆర్ ఆటగాళ్లు అంతా హ్యాపీగా ఉన్నారు. అయితే ఆ టీమ్​లోని ఓ ప్లేయర్ విషయంలో మాత్రం చర్చ జరుగుతోంది. కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ ఈసారి ఐపీఎల్​లో పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో భారత టీ20 వరల్డ్ కప్​ మెయిన్ టీమ్​లో అతడికి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో అతడు తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జట్టు కోసం ఎంతో చేయాలని అనుకున్నానని అన్నాడు.

ఈ ఐపీఎల్ సీజన్​లో ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచుల్లో కలిపి కేవలం 148 పరుగులే చేశాడు రింకూ. ఇందుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి అతడికి సరైన అవకాశాలు రాలేదు. బ్యాటింగ్ ఆర్డర్​లో పైకి పంపిస్తే క్విక్​గా రన్స్ చేసే సత్తా ఉంది. అయినా రింకూను కిందే ఆడించారు. ఎక్కువ మటుకు మ్యాచుల్లో ఆ టీమ్ ఓపెనర్లు నరైన్, సాల్ట్​లు బాగా ఆడటంతో రింకూకు సరిగ్గా బ్యాటింగ్ రాలేదు. కొన్ని మ్యాచుల్లో ఛాన్సులు వచ్చినా ఆడేందుకు ఎక్కువ బంతులు లేకపోవడంతో అతడు ఏమీ చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో తనలో దాగిన బాధను, నిరాశను తాజగా బయటపెట్టాడు రింకూ.

ఐపీఎల్-2024లో కేకేఆర్ కోసం ఎంతో చేయాలని అనుకున్నానని రింకూ తెలిపాడు. కానీ తనకు సరైన ఆపర్చునిటీస్ రాలేదన్నాడు. అయినా తాను నమ్మకం కోల్పేదన్నాడు. ‘ఈ సీజన్​లో నా టీమ్ కోసం పెద్దగా ఏమీ చేయలేకపోయా. నా బ్యాటింగ్​లో ఎత్తుపల్లాలు ఉన్నాయి. మా జట్టు ఓపెనర్లు బాగా ఆడటంతో నేను బ్యాటింగ్​కు దిగాల్సిన అవసరం కూడా అంతగా రాలేదు. అయినా నేను విశ్వాసం కోల్పోలేదు. నా మీద నాకు నమ్మకం ఉంది. టీమ్ కోసం ఎప్పుడు ఛాన్స్ వచ్చినా అద్భుతంగా ఆడగలనని భావిస్తున్నా’ అని రింకూ చెప్పుకొచ్చాడు. మరి.. కేకేఆర్ కోసం ఎంతో చేయాలనుకున్నా సరైన అవకాశాలు రాలేదంటూ రింకూ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.