iDreamPost
android-app
ios-app

అయోధ్యలానే.. మథుర, జ్ఞానవాపిలను హిందువులకు ఇచ్చేయాలి: KK మహ్మద్

  • Published Jan 23, 2024 | 5:37 PM Updated Updated Jan 23, 2024 | 5:37 PM

యావత్తుదేశం చూస్తుండగానే ఆ కొదాండ రాముడు తన జన్మస్థానం అయిన అయోధ్యలో కొలువుతీరినాడు. ఎంతో అంగరంగ వైభవంగా ఆ బాల రాముని విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగింది. ఇక నిన్నటితో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు ముగిసిన సందర్భంగా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ కేకే మహమ్మద్ హిందువుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకి ఆయన ఏమన్నారంటే..

  • Published Jan 23, 2024 | 5:37 PMUpdated Jan 23, 2024 | 5:37 PM
అయోధ్యలానే.. మథుర, జ్ఞానవాపిలను హిందువులకు ఇచ్చేయాలి: KK మహ్మద్

ఎంతో అట్టహాసంగా ఆ కోదండ రాముడు తన జన్మస్థానం అయిన అయోధ్యలో కొలువుతీరినాడు. చాలా అంగరంగ వైభవంగా ఆ బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగింది. ఈ క్రమంలోనే.. దేశమంతటా రామ నామంతో మారుమోగిపోయింది. ఇక నిన్నటితో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు ముగిశాయి. ఇదిలా ఉంటే.. అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం, బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు పూర్తయిన సందర్భంగా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ కేకే మహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హట్ టాపిక్ మారాయి. ఇంతకి ఆయన ఏమన్నారంటే..

దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న కల, ఎందరో మహానుభావుల పోరాటం అయోధ్య రామాలయానికి ప్రాణం పోసింది. అయితే రామ మందిర నిర్మాణంలో కేకే మహమ్మద్ పాత్ర కీలకంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే.. ప్రస్తుతం అయోధ్యలోని రామ మందిరం ఉన్న స్థానంలో బాబ్రీ మసీదు ఉండేది. అయితే ఈ బాబ్రీ మసీదును గతంలో కూల్చివేయడంతో దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. కాగా, ఆ స్థలాన్ని తవ్విన భారత పురావస్తు శాఖ బృందంలో 71 ఏళ్ల కేకే ముహమ్మద్ కూడా ఒక సభ్యుడు. కానీ, బాబ్రీ మసీదు కూల్చివేయడం ఒక పురావస్తు శాస్త్రవేత్తగా తనను ఎంతగానో దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహమ్మద్ జ్ఞానవాపి, మధుర హిందువులకు ఇష్టపూర్వకంగా అప్పగించాలని అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు అయోధ్యలానే.. మధురలోని ఉన్న శ్రీ కృష్ణ జన్మ స్థలాన్ని, అలాగే కాశీలోని జ్ఞానవాపి ప్రాంతాలను హిందువులకు ఇచ్చేయాలని మహమ్మద్ ముస్లింలకు సూచించారు. అలాగే రాముడు, శివుడు , శ్రీ కృష్ణుడి దేవాలయాలు ఉన్న ప్రాంతాలతో హిందువులకు ఎంతో భావోద్వేగాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాలతో ముస్లింలకు పెద్దగా సెంటిమెంట్ ఉండదని.. అందుకే వాటిని పవిత్ర ప్రాంతాలుగా చూసుకునే హిందువులకు ఇచ్చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని కేకే మహమ్మద్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. మరి, హిందువుల విశ్వాసాలను గౌరవిస్తూ మహమ్మద్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.