iDreamPost

Vikrant Rona: జీ5లో విక్రాంత్‌ రోణ, ఎప్పుడంటే?

Vikrant Rona: జీ5లో విక్రాంత్‌ రోణ, ఎప్పుడంటే?

కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌ నటించిన పాన్ ఇండియా సినిమా విక్రాంత్‌ రోణ. కొత్త‌నేప‌థ్యం, కొత్త త‌ర‌హా క‌థ‌నం. కేజీఎఫ్ త‌ర్వాత వ‌చ్చిన ఈ పాన్ ఇండియా సినిమా మంచి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. తెలుగులో నిర్మాత‌ల‌కు లాభ‌ల‌నిచ్చింది. జూలై 28న రిలీజైన ఈ పాన్‌ ఇండియా మూవీ అంచనాలకు తగ్గట్టుగానే రిలీజైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతోంది.

జీ5 విక్రాంత్‌ రోణ డిజిటల్‌ రైట్స్‌ను భారీ మొత్తానికి దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్‌ 2 నుంచి జీ 5లో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.


గ్లామరస్‌ హీరోయిన్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ హీరోయిన్‌గా నటించింది. అనూప్‌ భండారి డైరెక్ట్‌ చేయగా మంజునాథ్‌ గౌడ్‌ నిర్మించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి