iDreamPost

OTTలో గామి సునామి.. 72 గంటల్లో ఎన్ని మిలియన్ల వ్యుస్ అంటే?

Vishwak Sen Gaami Record In OTT: విశ్వక్ సేన్ అఘోరాగా తెరకెక్కిన గామి చిత్రం థియేటర్లలో అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో కూడా గామి చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఏకంగా 72 గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది.

Vishwak Sen Gaami Record In OTT: విశ్వక్ సేన్ అఘోరాగా తెరకెక్కిన గామి చిత్రం థియేటర్లలో అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో కూడా గామి చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఏకంగా 72 గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది.

OTTలో గామి సునామి.. 72 గంటల్లో ఎన్ని మిలియన్ల వ్యుస్ అంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు గామి రూపంలో అదిరిపోయే హిట్టు పడింది. విశ్వక్ స్టోరీ సెలక్షన్ ఎప్పుడూ టాప్ నాచ్ గా ఉంటుంది అని గామి రిజల్ట్ చూస్తేనే అర్థమవుతుంది. థియేటర్లలో గామి చిత్రం క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఈ మూవీ చూశాక క్రిటిక్స్ కూడా అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. అలాగే గామి చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఈ మూవీ ఇప్పుడు రికార్డుల వేట ఓటీటీలో ప్రారంభించింది. గామి చిత్రం ప్రస్తుతం అదిరిపోయే రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ వార్త విన్న తర్వాత మేకర్స్, సినిమా బృందం కూడా సంబరాలు చేసుకుంటోంది. మరి.. ఆ రికార్డు ఏంటో చూద్దాం.

గామి చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక ఆసక్తి, అంచనా చిత్రంపై ఉన్నాయి. ప్రేక్షకులు థియేటర్ కి వచ్చిన తర్వాత ఆ అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఆ తర్వాత తాజాగా గామి చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఏప్రిల్ 12 నుంచి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ గామి చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఇప్పుడు థియేటర్లు మాత్రమే కాకుండా.. ఓటీటీలో కూడా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది.

స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన కేవలం 3 రోజుల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. థియటేర్లలో విడుదలైన మూడు రోజుల్లోనే రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తే.. ఓటీటీలో కేవలం 72 గంటల్లోనే ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ సాధించి శభాష అనిపించింది. ఒక మూవీ కోసం ఒక టీమ్ ఏకంగా ఆరేళ్లు కష్టపడితే.. దాని రిజల్ట్ ఇలాగే డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటూ క్రిటిక్స్ కూడా పొగిడేస్తున్నారు. మొత్తానికి ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కోసం ఎట్టకేలకు గామి చిత్రం ఓటీటీలోకి రానే వచ్చింది.

ఓటీటీలోకి వచ్చిన తర్వాత.. ఏకంగా 72 గంటల్లోనే 50 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత విశ్వక్ సేన్, డైరెక్టర్, క్రూ మొత్తం ఫ్యాన్స్ చూపించే ప్రేమకు ఫిదా అయిపోయారు. థియేటర్లలో గానీ.. ఓటీటీలో గానీ ఊహించిన దానికంటే ఎక్కువ ప్రేమను చూపించారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు విశ్వక్ సేన్ అఘోరాగా ఎందుకు మారాడు? అందరికీ వరాలు ఇచ్చే ఆ భోళా శంకరుడు.. ఆ శంకర్ కి మాత్రం ఎందుకు శాపం పెట్టాడు? విశ్వక్ సేన్ శాపానికి విరుగుడు లేదా? గురువు చెప్పినట్లు శంకర్ ఆ మాలి పత్రాలను సంపాదించాడా? ఈ విషయాలు తెలియాలంటే జీ5లో గామి చిత్రం చూసేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి