iDreamPost

KGF Chapter 2 : మూడు వారాల గ్యాప్ తో మరో ప్యాన్ ఇండియా

ప్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టు వసూళ్లు వస్తున్నాయి. టాక్ కొంత డివైడ్ గా ఉన్న మాట వాస్తవమే కానీ రాజమౌళి సినిమాలకు ఇది ఎప్పుడూ జరిగేదే. కాకపోతే బాహుబలి స్థాయిలో నిలుస్తుందా దాన్ని దాటగలదా లేదా అనేది వేచి చూడాలి.

ప్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టు వసూళ్లు వస్తున్నాయి. టాక్ కొంత డివైడ్ గా ఉన్న మాట వాస్తవమే కానీ రాజమౌళి సినిమాలకు ఇది ఎప్పుడూ జరిగేదే. కాకపోతే బాహుబలి స్థాయిలో నిలుస్తుందా దాన్ని దాటగలదా లేదా అనేది వేచి చూడాలి.

KGF Chapter 2 : మూడు వారాల గ్యాప్ తో మరో ప్యాన్ ఇండియా

బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ హవా కొనసాగుతోంది. ఫైనల్ వర్డిక్ట్ చెప్పేయడం తొందపాటు అవుతుంది కాబట్టి కనీసం రెండు వారాలు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి భారీ రికార్డులు నమోదవుతున్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టు వసూళ్లు వస్తున్నాయి. టాక్ కొంత డివైడ్ గా ఉన్న మాట వాస్తవమే కానీ రాజమౌళి సినిమాలకు ఇది ఎప్పుడూ జరిగేదే. కాకపోతే బాహుబలి స్థాయిలో నిలుస్తుందా దాన్ని దాటగలదా లేదా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడీ ఆర్ఆర్ఆర్ రెస్పాన్స్ రాబోయే కెజిఎఫ్ 2 మీద మంచి ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 14న రాబోతున్న ఈ క్రేజీ బ్లాక్ బస్టర్ సీక్వెల్ మీద ముందు నుంచి మాములు అంచనాలు లేవు.

సరిగ్గా 20 రోజుల సమయం ఉంది. ప్రమోషన్ ని రేపటి నుంచి ట్రైలర్ లాంచ్ తో మొదలుపెట్టబోతున్నారు. వేర్వేరు బాషలకు ప్రత్యేకంగా ఈవెంట్లను ప్లాన్ చేశారు. టీజర్ తోనే గతంలో సెన్సేషన్ సృష్టించిన రాఖీ భాయ్ ఇప్పుడెలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి. ఇది విడుదలయ్యే నాటికి ఆర్ఆర్ఆర్ దాదాపు ముగింపుకి వచ్చేస్తుంది. పూర్తిగా తీసేయరేమో కానీ జనంలో ఆసక్తి బాగా తగ్గిపోయి ఉంటుంది. ఇది కెజిఎఫ్ 2 వాడుకుంటుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ పబ్లిసిటీ విషయంలో ప్రత్యేక ప్లాన్ తో సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా నార్త్ మార్కెట్ లో ఆర్ఆర్ఆర్ తేలేకపోయిన హెవీ బజ్ ని దీనికి వచ్చేలా సెట్ చేసుకుంటున్నారు.

కెజిఎఫ్ బడ్జెట్ ప్లస్ బిజినెస్ ఆర్ఆర్ఆర్ తో సమానంగా ఉంటుందని చెప్పలేం కానీ హైప్ విషయంలో దేనికవే సాటి అనే రీతిలో ఆకట్టుకుంటున్నాయి. విజయ్ బీస్ట్ పోటీకి రావడం కెజిఎఫ్ 2ని ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. తమిళనాడు రెవిన్యూ దీని వల్ల బాగా ఎఫెక్ట్ అవుతుందని ట్రేడ్ టెన్షన్ పడుతోంది. కేరళలోనూ ట్రబుల్ తప్పదు. ఇలా జరగకూడదు అంటే కెజిఎఫ్ 2 ట్రైలర్ కట్ చాలా కీలకం కానుంది. ఇది చూశాక బిజినెస్ లెక్కలు, జనాల అంచనాలు ఓ రేంజ్ కి వెళ్ళిపోతాయనే నమ్మకం యూనిట్ లో ఉంది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న కెజిఎఫ్ 2 మరి అంచనాలకు తగ్గట్టు ఉంటుందో లేదో మూడు వారాలు ఆగితే తేలిపోతుంది

Also Read : RRR Day 1 Collections : బాక్సాఫీస్ ని ఆక్రమిస్తున్న విజువలార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి