iDreamPost

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై ప్రభుత్వ అధికారుల కీలక ప్రకటన!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి .. ఆరు గ్యారెంటీలను వడివడిగా అమలు చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని పలు కుటుంబాలకు తీపి కబురు అందించింది రాష్ట్ర సర్కార్. కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి .. ఆరు గ్యారెంటీలను వడివడిగా అమలు చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని పలు కుటుంబాలకు తీపి కబురు అందించింది రాష్ట్ర సర్కార్. కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది.

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై ప్రభుత్వ అధికారుల కీలక ప్రకటన!

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు సీఎం. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర మహిళలకు, యువతులకు, విద్యార్థినులకు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించారు. అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10లక్షలకు పెంచింది ప్రభుత్వం. అలాగే రైతు భరోసా నిధుల విడుదలకు కూడా ఆమోదం తెలిపింది. అలాగే తెలంగాణలోని నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ఎదురు చూస్తున్న తెల్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసే పథకాలకు రేషన్ కార్డు తప్పని సరి. ఈ నేపథ్యంలో చాలా మంది రేషన్ కార్డులు లేక.. పథకాలు అందుకోలేకపోతున్నారు. ఇప్పుడు అమలు చేయబోతున్న నూతన పథకాలకు రేషన్ కార్డు కావాల్సిందే. కొన్నాళ్ల నుండి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు జరగలేదు.  దీంతో కొంత మంది లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . సుమారు లక్ష మంది లబ్దిదారులు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే లబ్దిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పింది. డిసెంబర్ 28 నుండి కొత్త రేషన్ కార్డుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పాత రేషన్ కార్డులో ఉన్న తప్పులు సరిదిద్దుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుందట.

ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. ఈ అంశంపై రేవంత్ రెడ్డి కలెక్టర్ కాన్ఫరెన్స్ అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో కొంత మంది అప్లిక్లేషన్ల కోసం మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇదే అవకాశమని భావించిన కొంత మంది అక్రమార్కులు.. దందా కొనసాగిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల ఆప్లికేషన్ ఇదేనంటూ ఓ నకిలీ ఫారాన్ని ప్రజలకు అంటగడుతున్నారు. రేషన్ కార్డు కావాలనుకుంటున్న వారు దరఖాస్తు చేయాల్సిన అప్లికేషన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ ఫారం హల్ చల్ చేస్తోంది. ఈ ఫారం ఇవ్వాలంటూ మీ సేవ సెంటర్లకు వెళ్లి.. డబ్బులు ఇచ్చి మరీ తీసుకుంటున్నారు.

ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫారం ఫేక్ అని చెబుతున్నారు. ప్రస్తుతం లబ్దిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం లేదని, నాలుగైదు రోజులు సమయం పడుతుందని చెబుతున్నారు. ప్రజలు తప్పుడు సమాచారంతో మోసపోవద్దని, డబ్బు, సమయాన్ని వృథా చేసుకోవద్దని హితవు కోరుతున్నారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు అందించే రూ. 2500 డబ్బులకు సంబంధించిన ఓ అప్లికేషన్ కూడా నెట్టింట్లో సర్క్యులేట్ అవుతుంది. ఈ పథకం వర్తించాలంటే కుల, ఆదాయ, బ్యాంకు, రేషన్ కార్దులు కావాలంటూ మహిళల్ని మభ్య పెడుతున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. అది ఫేక్ అని కొట్టిపారేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి