Somesekhar
నేనే గనక టీమిండియా సెలెక్టర్ అయితే.. టీ20 వరల్డ్ కప్ జట్టులోకి ముందుగా అతడినే తీసుకుంటాను అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లండ్ దిగ్గజ ప్లేయర్ కెవిన్ పీటర్సన్. మరి ఇంగ్లండ్ దిగ్గజం మెచ్చిన ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.
నేనే గనక టీమిండియా సెలెక్టర్ అయితే.. టీ20 వరల్డ్ కప్ జట్టులోకి ముందుగా అతడినే తీసుకుంటాను అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లండ్ దిగ్గజ ప్లేయర్ కెవిన్ పీటర్సన్. మరి ఇంగ్లండ్ దిగ్గజం మెచ్చిన ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.
Somesekhar
ఐపీఎల్ 2024 టోర్నీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే సగం సీజన్ పూర్తి చేసుకున్న ఈ సీజన్ లో జట్లు ఫ్లే ఆఫ్ లో చోటు సంపాదించడం కోసం తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇక ఈ టోర్నీలో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. ఒకరిని మించి ఒకరు తమ బ్యాట్లకు పనిచెబుతూ.. టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సీజన్ లో అటు కెప్టెన్ గా, ఇటు బ్యాటర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు ఓ టీమిండియా ప్లేయర్. దీంతో నేనే గనక టీమిండియా సెలెక్టర్ అయితే.. టీ20 వరల్డ్ కప్ జట్టులోకి ముందుగా అతడినే తీసుకుంటాను అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లండ్ దిగ్గజ ప్లేయర్ కెవిన్ పీటర్సన్.
ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా ప్లేయర్ల అందరి టార్గెట్ ఒక్కటే.. టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు. జూన్ లో ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీ కోసం ఎంతో మంది యువ క్రికెటర్లు ఎదురుచూస్తున్నారు. అయితే ఓ ప్లేయర్ మాత్రం అద్భుతంగా రాణిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడే టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్. రాజస్థాన్ రాయల్స్ టీమ్ ను కెప్టెన్ గా ముందుండి నడిపిస్తున్నాడు. 9 మ్యాచ్ ల్లో 8 విజయాలతో అందరికంటే ముందుగా ఈ సీజన్ ఫ్లే ఆఫ్ లోకి దూసుకెళ్లాడు సంజూ. కెప్టెన్ గా సూపర్ సక్సెస్ అయిన ఈ స్టార్ ప్లేయర్, బ్యాటర్ గా కూడా సత్తాచాటుతున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 385 పరుగులు చేసి లీడింగ్ స్కోరర్స్ లిస్ట్ లో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ లో చోటు ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. సంజూ శాంసన్ సూపర్ ఫామ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్. స్టార్ స్పోర్ట్స్ తో పీటర్సన్ మాట్లాడుతూ..”ఒకవేళ నేనే గనత ఇండియన్ సెలెక్టర్ అయితే.. సంజూ శాంసన్ ను మెుదటగా టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకుంటాను. నా ఫస్ట్ ఛాయిస్ అతడే. అతడిని అమెరికా, వెస్టిండీస్ విమానం ఎక్కిస్తాను” అని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అయితే సంజూకు రిషబ్ పంత్ నుంచి గట్టి పోటి ఎదురౌతోంది. పంత్ సైతం ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్ లో పంత్ 371 పరుగులు చేసి తాను కూడా వరల్డ్ కప్ రేసులో ఉన్నానని చెప్పకనే చెబుతున్నాడు. మరి కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Kevin Pietersen said, “if I was an Indian selector, Sanju Samson would’ve been one of my first picks for the T20 World Cup. He should be on the plane to the USA and West Indies”. (Star Sports). pic.twitter.com/DHVUVXYrIM
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 27, 2024