iDreamPost

నేటి నుంచి కేసీఆర్‌ రాజశ్యామల యాగం.. దీని ప్రత్యేతక ఏంటంటే

  • Published Nov 01, 2023 | 4:20 PMUpdated Nov 01, 2023 | 4:20 PM

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కి దైవ భక్తి మెండు. గతంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం చండీ యాగం.. 2018 ఎన్నికల ముందు రాజశ్యామల యాగం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి రాజశ్యామల యాగం చేస్తున్నారు కేసీఆర్‌. ఆవివరాలు..

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కి దైవ భక్తి మెండు. గతంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం చండీ యాగం.. 2018 ఎన్నికల ముందు రాజశ్యామల యాగం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి రాజశ్యామల యాగం చేస్తున్నారు కేసీఆర్‌. ఆవివరాలు..

  • Published Nov 01, 2023 | 4:20 PMUpdated Nov 01, 2023 | 4:20 PM
నేటి నుంచి కేసీఆర్‌ రాజశ్యామల యాగం.. దీని ప్రత్యేతక ఏంటంటే

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కాస్త దైవ భక్తి ఎక్కువే. ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఎందరో దేవుళ్లకి మొక్కకున్నారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత వాటిని చెల్లించుకున్నారు. ఇవే కాక.. రాష్ట్రం, ప్రజలు క్షేమంగా ఉండటం కోస 2015లో చండీయాగం నిర్వహించారు. ఆ తర్వాత 2018 రెండో సారి ఎన్నికలకు వెళ్లే ముందు కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం తర్వాత ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. రెండో సారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ ఫాలో అవుతున్నారు సీఎం కేసీఆర్‌. 2018 మాదిరే ఈ సారి కూడా ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగాన్ని నిర్వహించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు యాగం నిర్వహిస్తారు.

సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవయసాయ క్షేత్రంలో నేటి (నవంబర్ 1) నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు ఈ యాగం నిర్వహణలో పాల్గొననున్నారు. ఇప్పటికే సుమారు 200 మంది వైదికులు మంగళవారం సాయంత్రానికి ఎర్రవల్లి గ్రామానికి చేరుకున్నారు.

మొదటిరోజు తెల్లవారుజామున సంకల్పంతో రాజశ్యామల యాగానికి శ్రీకారం చుడతారు. రెండో రోజు వేదపారాయణం, హోమం తదితర క్రతువులు నిర్వహించనున్నారు. చివరిరోజు పూర్ణాహుతి ఉంటుంది అని తెలిపారు. యాగంలో పాల్గొనడంలో కోసం కేసీఆర్‌ తన సతీమణితో కలిసి మంగళవారం అనగా అక్టోబరు 31 రాత్రి ఎర్రవల్లికి చేరుకున్నారు.

రాజశ్యామల యాగం ఎందుకు చేస్తారంటే..

రాజ శ్యామల యాగం అంటే  ఏంటి.. ఎందుకు చేస్తారు అంటే.. రాజ్యలక్ష్మి వరించాలని.. విజేతగా నిలవాలని కోరుతూ చేసేదే ఈ రాజశ్యామల యాగం. ఇది చేస్తే శత్రువు బలం తగ్గుతుంది, రాజకీయాల్లో విజయ లక్ష్మి వరిస్తుందని విశ్వసిస్తారు. అయితే చాలా మందికి మహాభారతంలో ధర్మరాజుతో శ్రీ కృష్ణుడు చేయించిన రాజసూయ యాగం, ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్న రాజశ్యామల యాగం రెండు ఒకటేనా అనే అనుమానం ఉంది. దీనిపై పండితులు స్పందిస్తూ.. ఈ రెండు యాగాలు ఒకటే కాకపోయినా వాటి వెనకున్న ఆంతర్యం, పరమార్థం మాత్రం ఒకటే అని చెబుతున్నారు.

ప్రారంభించిన కార్యంలో విజయం అందుకోవాలి, శత్రువు బలం క్షీణించాలి, సార్వ భౌమాధికారం సిద్ధించాలి, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తారు. అంతేకాక రాజసూయ యాగం చాలా పెద్ద క్రతువు. దాన్ని నిర్వహించడం అంత తేలక కాదు. అందుకే దానికి బదులుగా రాజశ్యామల యాగం చేసి.. తమకు విజయం సిద్ధించేలా చేయమని శ్యామలా దేవిని ప్రసన్నం చేసుకుంటారు. ఇక 2018లో కేసీఆర్‌ రాజశ్యామల యాగం చేశాడు.. ఎన్నికల్లో విజయం సాధించాడు. ఈ సారి కూడా సేమ్‌ రిజల్ట్‌ రిపీట్‌ అవుతుంది అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి