iDreamPost

అప్పుడు తండ్రి జిల్లా ఫస్ట్.. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూతురు స్టేట్ ఫస్ట్

అప్పుడు తండ్రి జిల్లా ఫస్ట్.. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూతురు స్టేట్ ఫస్ట్

ఓ కూతురు దాదాపు 20 ఏళ్ల తర్వాత తన తండ్రి సాధించిన విజయం మాదిరిగానే తాను సాధించి ఇది కలా నిజమా అన్నట్లుగా అద్భుతం సృష్టించింది. తండ్రి ఏవిధంగానైతే అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నాడో అదే విధంగా కూతురు అంకితభాంతో చదివి లక్ష్యాన్ని ఛేదించింది. తాజాగా టీఎస్పీఎస్సీ విడుదల చేసిన ఏఈఈ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆమె మంచిర్యాల జిల్లా లక్సెట్టి పేటకు చెందిన నల్ల కావ్య శ్రీ. కాగా తన తండ్రి చంద్రయ్య 2003 డీఎస్సీలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఇప్పుడు సరిగ్గా 20 ఏళ్ల తర్వాత కూతురు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

లక్సెట్టి పేటకు చెందిన నల్ల కావ్య శ్రీ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షల ఫలితాల్లో మెరిసింది.గురువారం విడుదలైన ఏఈఈ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అయితే తన తండ్రి 2003లో నిర్వహించిన డీఎస్సీలో డిస్ట్రిక్ట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. చంద్రయ్య కోటపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రిని ఆదర్శంగా తీసుకున్న కూతురు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో అభినందనలు వెల్లవెత్తుతున్నాయి.కాగా లక్షెట్టిపేట పట్టణంలోని మోదెల రోడ్డుకు చెందిన నల్ల చంద్రయ్య, సునీత దంపతుల పెద్ద కుమార్తె కావ్యశ్రీ .కావ్యశ్రీ ఉస్మానియా యూనివర్సిటీలో ఈఈఈ పూర్తి చేసి పోటీ పరీక్షల కోసం మూడేళ్లు కష్టపడి చదివింది. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఏఈఈ పరీక్షను రాసింది. తన తండ్రి 2003లో నిర్వహించిన డీఎస్సీలో డిస్ట్రిక్ట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా ఇప్పుడు 2023 లో కూతురు ఏఈఈ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి