SNP
Kavya Maran, Pat Cummins, SRH: ఐపీఎల్ 2024 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ ఎన్ని ప్లాన్స్ వేసిందో ఏమో తెలియదు కానీ.. ఆ ఒక్క ఐడియా ఆ జట్టు తలరాతనే మార్చేసింది. మరి అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
Kavya Maran, Pat Cummins, SRH: ఐపీఎల్ 2024 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ ఎన్ని ప్లాన్స్ వేసిందో ఏమో తెలియదు కానీ.. ఆ ఒక్క ఐడియా ఆ జట్టు తలరాతనే మార్చేసింది. మరి అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
SNP
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరుకుంది. మే 26(ఆదివారం)న కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. చెన్నైలోని చిదంబరం క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ గెలిస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో రెండో ఐపీఎల్ టైటిల్ వచ్చి చేరుతుంది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2లో ఎస్‌ఆర్‌హెచ్ సూపర్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. తొలి బ్యాటింగ్‌లో కాస్త తడబడినా.. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి.. ఆర్‌ఆర్‌పై 36 పరుగులతో గెలిచి.. సగర్వంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక కేకేఆర్‌తో తుది పోరు కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్ ఈ రేంజ్‌లో సక్సెస్ అవ్వడానికి కారణం గురించి ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి.
ఆ జట్టు ఓనర్ కావ్య మారన్‌కు ఈ సక్సెస్‌లో ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆమె తీసుకున్న ఒక నిర్ణయం టీమ్ తలరాతనే మార్చేసిందని చెప్పాలి. ఆ నిర్ణయం ఏంటంటే.. టీమ్‌లోకి ప్యాట్ కమిన్స్‌ను తీసుకోవడమే. కమిన్స్ కోసం కావ్య ఏ రేంజ్‌కి వెళ్లిందంటే.. వేలంలో కావ్య చూపిన దూకుడు చూసి.. ఇతర ఫ్రాంచైజ్ ఓనర్లను నవ్వుకున్నారు. ఎందుకు కమిన్స్ కోసం అంత ధర పెడుతోంది. అతనికి అంత అవసరమా? అంటూ హేళన చేశారు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం జరిగిన వేలంలో కావ్య మారన్ కమిన్స్‌ను ఏకంగా 20.5 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. అదే వేలంలో స్టార్క్‌కు దక్కిన 24.75 ధర తర్వాత అత్యధిక ధర అదే. అంత మొత్తంలో కమిన్స్‌ను కొనుగోలు చేయడంపై కావ్యను నుంచి, ఆ నిర్ణయంపై చాలా మంది నవ్వుకున్నారు.
వన్డే వరల్డ్ కప్ గెలిపించాడని, 20.5 కోట్లు పెట్టి కొంది.. ఏమైనా పచ్చిపట్టిందా అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అతను కెప్టెన్సీ చేసి ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించింది వన్డేల్లో అని, ఇది టీ20 క్రికెట్ అని ఆ మాత్రం కావ్యకు తెలియదా అంటూ దారుణంగా ట్రోల్ చేశారు కూడా. కానీ, కమిన్స్‌పై నమ్మకం పెట్టుకున్న కావ్య.. అతన్ని నమ్మి కెప్టెన్సీ అప్పగించి టీమ్‌ని అతని చేతుల్లో పెట్టింది. కావ్య బలంగా తీసుకున్న ఆ నిర్ణయమే ఎస్‌ఆర్‌హెచ్ తలరాతను మార్చేసిందని చెప్పాలి. ఐపీఎల్ 2023లో పాయింట్ల పట్టికలో బటమ్‌లో ఉన్న టీమ్ ఇప్పుడు ఫైనల్‌కు దూసుకెళ్లింది. కేవలం ఒక్క ఏడాదిలో ఈ తేడాకు కారణం కావ్య తీసుకున్న డేర్ అండ్ డాషింగ్ నిర్ణయం. కమిన్స్ కెప్టెన్‌గా వచ్చిన తర్వాత.. అగ్రెసివ్ క్రికెట్ అంటూ జట్టుకు కొత్త పాఠం నేర్పించాడు. ఇండియన్ టాలెంట్‌తో ఆసీస్ పవర్‌ను జతకలిపాడు.
అభిషేక్, హెడ్ జోడీ ఈ సీజన్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టించిందో మనం చూశాం. అలాగే మిడిల్డార్‌లో క్లాసెన్ లాంటి భీకర బ్యాటర్‌తో పాటు నితిష్ కుమార్‌రెడ్డి, అబ్దుల్ సమద్‌ను ఆడించి.. బ్యాలెన్స్ చేశాడు. రాహుల్ త్రిపాఠి, మార్కరమ్‌ను టైమ్‌ను బట్టి టీమ్‌కు పనికొచ్చేలా వాడాడు. బౌలింగ్‌లో భువీని నమ్మి, నటరాజన్‌కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి.. తాను కూడా బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌కు వెన్నుముకలా నిలిచాడు. ఇలా టీమ్‌ను ఒక తిరుగులేని శక్తిగా మర్చాడు. కమిన్స్ ఇలాంటి అద్భుతం ఏదో చేస్తాడని నమ్మిన మొదటి వ్యక్తి కావ్య మారన్. అందుకే కమిన్స్ సక్సెస్‌లో, ఎస్‌ఆర్‌హెచ్ సక్సెస్‌లో ఆమెదే అగ్రభాగం. కమిన్స్‌ను అంత ధర పెట్టి కొన్నప్పుడు నవ్విన వారే.. ఇప్పుడు ఎస్‌ఆర్‌హెచ్ ప్రదర్శన చూసి చప్పట్లు కొడుతున్నారు. మరి ఇలాంటి సక్సెస్‌కు కారణం అయిన కావ్య మారన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kavya Maran got applaud at IPL Auction after buying most expensive Pat Cummins at 20 crore 50 lakh#IPL2024Auction #PatCummins #SRH #KavyaMaran pic.twitter.com/362T8CWDsu
— Republic of Games (@kohlilfc) December 19, 2023
If you are Hyderabad fans please don’t send Kaviya Maran into the auction.
Look at the Daniel Vettori face when they bought pat Cummins.
Only pat Cummins will be happy with the deal 😄#IPLAuction #iplauction2024 #Hardik #Kavya #iplauction2024 #CricketTwitter pic.twitter.com/rYQDFHquKd
— Sujeet Suman (@sujeetsuman1991) December 19, 2023