iDreamPost

హీరో ధనుష్ తండ్రినని కోర్టుకెక్కిన కధిరేశన్ కన్నుమూత!

Dhanush Fake Father: తమిళ ఇండస్ట్రీలో తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించిన హీరో ధనుష్ తమ కొడుకు అంటూ గతంలో కోర్టు కేసులు నడిచిన విషయం తెలిసిందే.

Dhanush Fake Father: తమిళ ఇండస్ట్రీలో తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించిన హీరో ధనుష్ తమ కొడుకు అంటూ గతంలో కోర్టు కేసులు నడిచిన విషయం తెలిసిందే.

హీరో ధనుష్ తండ్రినని కోర్టుకెక్కిన కధిరేశన్ కన్నుమూత!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. దర్శకుడు, నిర్మాత కస్తూరి రాజా, దర్శకుడు సెల్వ రాఘవన్ ఇద్దరూ ఇండస్ట్రీకి చెందిన వారు కావడం.. వారి ప్రోత్సాహంతో 2022 లో ‘తుళ్లువదో ఇలామై’ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నటుడు, రచయిత, సింగర్ గా తన సత్తా చాటుతున్నాడు. 2004 లో సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను వివాహం చేసుకున్న ధనుష్.. 2022న విడాకులు ట్విట్టర్ వేధికగా వెల్లడించారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు. ఇదిలా ఉంటే 2015 ధనుష్ తమ కొడుకు అంటూ ఓ దంపతులు కోర్టుకు ఎక్కడం అప్పట్లో సెన్సేషన్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

తమిళ నాటు స్టార్ హీరోగా వెలిగిపోతున్న ధనుష్ తమ కొడుకే అంటూ మధురైకి చెందిన కధిరేశన్, మీనాక్ష అనే భార్యాభర్తలు 2015 లో కేసు వేశారు. అప్పట్లో కోలీవుడ్ లో ఇది ఒక సెన్సేషన్ న్యూస్ గా మారింది.  సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు, హీరోగా ధనుష్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో కధిరేశన్, మీనాక్షి కోర్టుకు ఎక్కడం చర్చనీయాంశంగా మారింది. ధనుష్ స్కూల్ నుంచి తమకు చెప్పకుండా ఎటో పారిపోయాడని.. తర్వాత దర్శకుడు కస్తూరి రాజా ఇంటికి చేరి దత్తపుత్రుడు అయ్యాడని పేర్కొన్నారు. తమ కొడుకు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాడని.. ప్రతి నెల పోషణ భృతి ఇవ్వాలని కధిరేశన్, మీనాక్ష దంపతులు డిమాండ్ చేశారు.

ఈ కేసులో ధనుష్ నకిలీ విద్యార్హత, జనన ధృవీకరణ పత్రాలు సమర్పించారని క్రిమినల్ యాక్షన్ ఆఫీస్ కదిరేశన్ మధురై ఆరో మెజిస్ట్రేట్ కోర్టులో పిటీషన్ వేశారు. కానీ ఆ పిటీషన్ కొట్టివేసింది కోర్టు. దీన్ని వ్యతిరేకిస్తూ హై కోర్టులో రివిజన్ పిటీషన్ దాఖలు చేశారు. అందులో ధనుష్ దాఖలు చేసిన జనన ధృవీకరణ పత్రం ప్రామాణికత నిర్ణయంతో కోర్టుకు పంపలేదని, దాన్ని పట్టించుకోకుండా మెజిస్ట్రేట్ ఉత్తర్వులను రద్దు చేసి, తగు విచారణ జరిపించాలని కోరారు. ఇదిలా ఉంటే.. పూర్తి ఆధారలు లేనందున కేసు కొట్టి వేస్తున్నాం అని ఇటీవల న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తమ కొడుకు అంటూ దావా వేసిన కధిరేషన్ ఇటీవల అనారోగ్యం కారణంగా మధురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి