iDreamPost

పాక్ సహా భారత వ్యతిరేకులకు కశ్మీర్ జర్నలిస్ట్ స్ట్రాంగ్ కౌంటర్!

పాక్ సహా భారత్ వ్యతిరేకులకు కశ్మీర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త యానా మీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది! యూకే పార్లమెంట్ వేదికగా మలాలా యూసఫ్ జాయ్ పై కూడా విరుచుకుపడింది.

పాక్ సహా భారత్ వ్యతిరేకులకు కశ్మీర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త యానా మీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది! యూకే పార్లమెంట్ వేదికగా మలాలా యూసఫ్ జాయ్ పై కూడా విరుచుకుపడింది.

పాక్ సహా భారత వ్యతిరేకులకు కశ్మీర్ జర్నలిస్ట్ స్ట్రాంగ్ కౌంటర్!

జమ్మూ కశ్మీర్ విషయంలో భారతదేశంతో ఎప్పుడూ గొడలు పడుతూనే ఉంటుంది పాకిస్తాన్. ఈ విషయం ప్రపంచం మెుత్తానికీ తెలుసు. అయితే కొన్ని దేశాలు పాక్ కు అనుకూలంగా స్టేట్ మెంట్స్ పాస్ చేస్తూ వస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానం తప్పని పాక్ లేనిపోని నిందలు వేస్తోంది. అయితే ఈ విషయంలో పాక్ సహా భారత వ్యతికేక శక్తులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కశ్మీరీ జర్నలిస్టు యానా మీర్. తాజాగా ఆమెకు డైవర్సిటీ అంబాసిడర్ అవార్డుతో యూకే పార్లమెంట్ లో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె పాక్ సహా భారత్ కు ఆపోజిట్ గా ఉన్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది.

జమ్మూ కశ్మీర్ కు చెందిన సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ యానా మీర్ కు డైవర్సిటీ అంబాసిడర్ అవార్డు ఇచ్చి సత్కరించింది యూకే పార్లమెంట్. బ్రిటన్ లోని జమ్మూ కశ్మీర్ సెంటర్ ఫర్ స్టడీస్.. కశ్మీర్ సమస్యలు, వాటి పరిష్కారం కోసం పనిచేస్తోంది. ఇందుకోసం పనిచేసేవారికి అవార్డులను ఇచ్చి సత్కరిస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది కశ్మీర్ కు చెందిన సామాజిక కార్యకర్త, జర్నలిస్టు యానా మీర్ కు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె యూకే పార్లమెంట్ లో ప్రసంగించారు.

“నేనేమీ మలాలా యూసఫ్ జాయ్ ను కాదు. భారత్ లో మేం ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నాం. నా కన్నతల్లి కశ్మీర్ లో నేను సురక్షితంగా ఉన్నాను. ఇక్కడి నుంచి పారిపోయి వచ్చి.. మీ దేశంలో శరణార్థిలా ఆశ్రయం కోరను.. ఎందుకంటే? నేను మలాలాను కాదు. యూకే, పాక్ లో నివశిస్తున్న నేరస్థులు, ఇంటర్నేషనల్ మీడియా, మానవ హక్కుల వేదికలలో నా దేశాన్ని తిట్టడం ఆపేయండి. మా వెంటపడటం మానేయండి.. కశ్మీర్ సమాజాన్ని శాంతితో జీవించనివ్వండి” అంటూ భావోద్వేగపూరిత ప్రసంగం చేసింది యానా మీర్. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాక్ తో సహా భారత వ్యతిరేక దేశాలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి