iDreamPost

Anupama Parameswaran: అనుపమపై బోల్డ్ ముద్ర.. ఇండస్ట్రీ రెడీగా ఉంది అను జాగ్రత్త!

సినీ ఇండస్ట్రీలో ట్రెషనల్ పాత్రల్లోనే నటించే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో కొందరు పరిస్థితులను బట్టి..ట్రెడిషనల్ నుంచి గ్లామర్ పాత్రల వైపు వెళ్తుంటారు. అలానే అలాంటి వారిలో చాలా మందే హీరోయిన్లు ఉన్నారు. తాజాగా వారి జాబితాలో కేరళ కుట్టి అనుపమ చేరుతుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

సినీ ఇండస్ట్రీలో ట్రెషనల్ పాత్రల్లోనే నటించే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో కొందరు పరిస్థితులను బట్టి..ట్రెడిషనల్ నుంచి గ్లామర్ పాత్రల వైపు వెళ్తుంటారు. అలానే అలాంటి వారిలో చాలా మందే హీరోయిన్లు ఉన్నారు. తాజాగా వారి జాబితాలో కేరళ కుట్టి అనుపమ చేరుతుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Anupama Parameswaran: అనుపమపై బోల్డ్ ముద్ర.. ఇండస్ట్రీ రెడీగా ఉంది అను జాగ్రత్త!

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడికి ఎంతో మంది హీరోయిన్లు తమదైన నటనతో మెరుస్తుంటారు. కేవలం తమ అభినయంతోనే ఆకట్టుకునే హీరోయిన్లు ఎందరో ఉన్నారు. వారు గ్లామర్స్ పాత్రలకు చాలా దూరంగా ఉంటూనే ఇండస్ట్రీలో నెగ్గుకోస్తున్నారు. అయితే కొందరు మాత్రం సడెన్ గా టర్న్ తీసుకుని ట్రెడిషనల్ ఇమేజ్ నుంచి గ్లామర్స్ పాత్రల వైపు అడుగులు వేస్తుంటారు. అలా ఎందరో హీరోయిన్లు గ్లామర్స్ పాత్రలు ఉన్న సినిమాలకే పరిమితమై..తమ కెరీర్ ను ముగించారు. తాజాగా అలాంటి వారి జాబితాలోకి మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ వెళ్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరును తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అందం అభినయంతో తెలుగు కుర్రాళ్లకు పక్కింటి అమ్మాయి అనిపించే అంతలా దగ్గరైంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అనుపమ పరిచయమైంది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించింది. తెలుగమ్మాయి అనేంతాల ఆకట్టుకుంది. శతమానం భవతి సినిమాతో మంచి పేరు సంపాదించింది. ప్రతి సినిమాలోనూ ట్రేడిషనల్ గా కనిపించేది. అందుకే  అనుపమ గ్లామర్స్ పాత్రలు చేయకున్న ఆమెకంటూ ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం తన నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే అతికొద్ది మంది హీరోయిన్లో అనుపమ ఒకరు. అలాంటి  అనుపమ ట్రాక్ తప్పిందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

Anupamaa

ఇటీవల విడుదలై టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్  చూసి షాకవ్వని వాళ్లు లేరు. ఆ బ్యూటీ తన పదేళ్ల కేరీర్లో ఎప్పుడూ ఈ సినిమాలో ఉన్నంత హాట్ హాట్గా  కనిపించలేదు. గత ముందు ట్రెడిషనల్ ముద్ర వేయించుకున్న వాళ్లు తర్వాత కొంచెం గ్లామరస్‌గా కనిపించడం మామూలే. కానీ.. అనుపమ లాంటి ట్రేడిషనల్ ఇమేజ్ ఉన్న వాళ్లు ఒక సినిమాలోనే లెక్క పెట్టుకోలేనన్ని లిప్ లాక్స్ చేయడం.. క్లీవేజ్ షోలు చేయడం.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టిల్లు స్క్వేర్ సినిమా తరువాత అనుపమ ఇమేజ్ మారిపోవడంతో ఆమెకు వరుసగా బోల్డ్ క్యారెక్టర్ల ఆఫర్లే వస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఆమెకు పారితోషం కూడా ఎక్కువగా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధమైవుతున్నట్లు తెలుస్తోంది.

అందాలు ఆరబోస్తూ ఇంటిమేట్ సీన్లు, లిప్ లాక్స్ చేస్తే ఎంతైనా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారట. కానీ ఇలా రెమ్యూనరేషన్ కి టెమ్ట్ అయి అనుపమ కూడా అందాల ఆరబోత అనే రొప్పింలోకి దిగుద్దా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనుమపతో గ్లామర్స్ బేస్ ఉండే సినిమాలు చేయించేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.. కానీ అనుమపమే ఆ రొంపిలోకి దిగ్గకుండా ఉండాలనే అభిప్రాయా పడుతున్నారు. ముందులా ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేస్తూనే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఇలాంటి పాత్రలు చేయాలని.. అందుకే ఆచితూచి సినిమాలు ఎంచుకోవాలని పలువురు అభిప్రాయా పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి