iDreamPost

దంపతుల గలీజ్ పనులు.. ఉద్యోగాలు ఇప్పిస్తామని అమ్మాయిలను నమ్మించి..!

దంపతుల గలీజ్ పనులు.. ఉద్యోగాలు ఇప్పిస్తామని అమ్మాయిలను నమ్మించి..!

కర్ణాటక రాష్ట్రం నామక్కల్ జిల్లా తిరుచ్చంగోడులో వెంకటాచలం (56)-మధుబాల (48) దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ భార్యాభర్తలు డబ్బులు ఎలా సంపాదించాలనే దానిపై అనేక ప్రయత్నాలు చేసి చివరికి విఫలమయ్యారు. ఈ క్రమంలోనే ఈ దంపతులకు ఓ గలీజ్ దందా చేయాలనే ఆలోచన వచ్చింది. ఇక అనుకున్నదే ఆలస్యం.. ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఇక స్థానికంగా నివాసం ఉంటున్న నిరుపేద యువతలకు గాలం వేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. నిజమేనేమోనని ఎంతో మంది నిరుద్యోగ యువతులు వారిని నమ్మి వారి పెట్టిన అడ్రస్ కు వెళ్లారు. మొత్తానికి ఈ దంపతులు వారికి ఎలాగో నచ్చ జెప్పి చివరికి వ్యభిచార రొంపిలికి దింపారు.

ఇలా గత కొంత కాలంగా ఈ దంపతులు సీక్రెట్ గా వ్యభిచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈ దంపతుల తీరుపై స్థానికులకు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక పక్కా ప్లాన్ తో కదిలిన పోలీసులు ఆ వ్యభిచార గృహంపై దాడులు చేసి వెంకటాచలం, మధుబాల దంపతులను అరెస్ట్ చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూాడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి .. ఆమె చేసిన పనికి అందరు షాక్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి