iDreamPost

భర్త కళ్లముందే ప్రియుడితో భార్య రొమాన్స్! కానీ, భర్త ఇలా చేశాడేంటి?

భర్త కళ్లముందే ప్రియుడితో భార్య రొమాన్స్! కానీ, భర్త ఇలా చేశాడేంటి?

పెద్దల సమక్షంలో ఏడడుగులు నడిచి పెళ్లి బంధంతో భార్యాభర్తలుగా ఒక్కటవుతారు. ఇక ఆ క్షణం ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు ఎదురొచ్చినా నీకు నేను, నాకు నీవ్వు అన్నట్లుగా ముందుకు సాగిపోతుంటారు. కానీ, ఈ రోజుల్లో మాత్రం కొందరు దంపతులు క్షణిక సుఖం కట్టుకున్న వాళ్లను కాదని పరాయి వాళ్లపై మోజు పడుతు సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాగే భార్య చేతిలో మోసపోయిన ఓ భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని గువ్వలకానహళ్లిలో సురేష్-హేమావతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లల సంతానం. భార్య గ్రామంలో అంగన్ వాడి కార్యకర్తగా పని చేస్తుండగా, భర్త స్థానికంగా ఓ కంపెనీలో పని చేస్తుండేవాడు. అలా చాలా కాలం నుంచి వీరి సంసారం సంతోషంగానే సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే భార్య హేమావతి స్థానికంగా ఉన్న గంగాధర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భర్త అనుమానించాడు. పద్దతి మార్చుకోవాలంటూ భర్త భార్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయినా ఆ మహిళ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

ఇదిలా ఉంటే.. ఇటీవల భార్య హేమావతి ప్రియుడు గంగాధర్ తో ఉండగా భర్త సురేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీంతో సురేష్ భార్య, ఆమె ప్రియుడితో గొడవ పెట్టుకున్నాడు. భయంతో హేమావతి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురుని స్టేషన్ కు తీసుకెళ్లి ముగ్గురికి కౌన్స్ లింగ్ ఇచ్చారు. కానీ, హేమావతి మాత్రం భర్తకు విడాకులు ఇచ్చి ప్రియుడికి దగ్గరవ్వాలని చూసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త సురేష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

ఇక భార్య మోసాన్ని తట్టుకోలేని భర్త సురేష్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హేమావతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భర్తకు దూరమై ప్రియుడికి దగ్గరవ్వాలని చూసి చివరికి భర్త మరణానికి కారణమైన హేమావతి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: దారుణం: ప్రముఖ సింగర్ ను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి