iDreamPost
android-app
ios-app

టెన్త్‌లో 625కి 625 మార్కులు.. అంకితకు రూ.5 లక్షల ప్రోత్సాహకం

  • Published May 15, 2024 | 11:24 AMUpdated May 15, 2024 | 11:24 AM

10th 2024 Results: పదో తరగతి పరీక్షల్లో 625 మార్కులకు గాను 625 మార్కులు సాధించిన అంకితను ప్రభుత్వం ప్రశంసిచండమే కాక భారీ నగదు ప్రోత్సాహకం కూడా అందించింది. ఆ వివరాలు..

10th 2024 Results: పదో తరగతి పరీక్షల్లో 625 మార్కులకు గాను 625 మార్కులు సాధించిన అంకితను ప్రభుత్వం ప్రశంసిచండమే కాక భారీ నగదు ప్రోత్సాహకం కూడా అందించింది. ఆ వివరాలు..

  • Published May 15, 2024 | 11:24 AMUpdated May 15, 2024 | 11:24 AM
టెన్త్‌లో 625కి 625 మార్కులు.. అంకితకు రూ.5 లక్షల ప్రోత్సాహకం

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో కూడా పదోతరగతి, ఇంటర్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. పేద కుటుంబాల్లో పుట్టి.. ఆర్థిక కష్టాలు దాటుకుని పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యా కుసుమాలు ఎందరో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ పదో తరగతి విద్యార్థిని.. టెన్త్‌లో 599 మార్కులు సాధించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే రికార్డు. ఈ క్రమంలో తాజాగా వెల్లడైన కర్టాటక పదో తరగతి ఫలితాల్లో ఓ విద్యార్థి ఏకంగా 625కి 625 మార్కులు సాధించి దేశంలోనే రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అంకిత అనే రైతు బిడ్డ పదో తరగతిలో 625 మార్కులకు గాను.. 625 మార్కులు సాధించి.. చరిత్ర సృష్టించింది. అంకితపై సామాన్యులు మాత్రమే సినీ సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపించారు. కాంతార హీరో రిషబ్‌ శెట్టి సైతం అంకిత మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో అంకితకు మరో గౌరవం దక్కింది. ఆ వివారలు..

కర్టాటక ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల ఫలితాల్లో అసమాన ప్రతిభ చూపిన బాగల్‌కోట్‌ జిల్లా ముధోల్‌కు చెందిన అంకితను ఆరాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రశించారు. అంతేకాక 625 మార్కులకు గాను 625 మార్కులు సాధించిన అంకితను సన్మానించి.. ఆమెకు ఏకంగా 5 లక్షల రూపాయలను బహుకరించారు. బెంగుళూరులో మంగళవారం అంకిత తల్లిదండ్రులను కలిసిన డీకే శివకుమార్‌ ఆమెకు రూ.5 లక్షల చెక్కును బహుమతిగా అందజేసి ప్రోత్సాహించారు. అలాగే రాష్ట్ర రెండో ర్యాంకర్‌ మాండ్యకు చెందిన నవనీత్‌ అనే బాలుడిని కూడా సన్మానించి రూ.2 లక్షల చెక్‌ అందజేశారు.

ఆ తర్వాత డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బాగల్‌కోట్‌లోని మొరార్జీ దేశాయ్‌ పాఠశాలకు చెందిన అంకిత పదో తరగతిలో 625కి 625 మార్కులు సాధించడం మన రాష్ట్రానికే గర్వకారణం. పదో తరగతి ఫలితాల్లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన అంకితకు ఫోన్‌ చేసి అభినందించాను. ప్రభుత్వం తరఫున బాలికను, ఆమె తల్లిదండ్రులను అభినందిస్తున్నాను. బాలిక తదుపరి చదువు కోసం రూ. 5 లక్షలు బహుమతిగా ఇస్తున్నాను. అలానే మాండ్యకు చెందిన నవనీత్ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ద్వితీయ స్థానంలో నిలిచాడు. అతనికి రూ.2 లక్షలు బహుమతిగా ఇస్తున్నానని’’ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన అంకిత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు డీకే శివకుమార్‌. మిగతా పిల్లలు కూడా ఇలాగే చదివి తమ పాఠశాలలకు, గురువులు, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పదో తరగతి ఫలితాల్లో 100 శాతం మార్కులు సాధించిన అంకితను సీఎం సిద్ధరామయ్య సైతం ప్రశంసించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి