iDreamPost

దిశ కేసు ఆధారంగా బాలీవుడ్‌లో మూవీ! స్టార్ హీరోహీరోయిన్స్ రంగంలోకి దిగారు!

వెండితెర, ఓటీటీల్లో క్రైమ్ కథలకు బాగా ఆదరణ లభిస్తుంది. కిల్లర్ సూప్, కర్రీ అండ్ సెనైడ్ వంటి క్రైమ్ కథలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే కాదు.. దేశాన్ని కుదిపేసిన ఓ హత్య కేసును తెరకెక్కించబోతుంది బాలీవుడ్.

వెండితెర, ఓటీటీల్లో క్రైమ్ కథలకు బాగా ఆదరణ లభిస్తుంది. కిల్లర్ సూప్, కర్రీ అండ్ సెనైడ్ వంటి క్రైమ్ కథలే అందుకు ఉదాహరణలు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే కాదు.. దేశాన్ని కుదిపేసిన ఓ హత్య కేసును తెరకెక్కించబోతుంది బాలీవుడ్.

దిశ కేసు ఆధారంగా బాలీవుడ్‌లో మూవీ!  స్టార్ హీరోహీరోయిన్స్ రంగంలోకి దిగారు!

ఈ మధ్య కాలంలో రియల్ క్రైమ్ కథలను సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లుగా తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో జరిగిన పలు క్రైమ్ సంఘటనలు ఆధారంగా ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. కేరళలో జూలీ జోసేఫ్ అనే మహిళ ఆరు హత్యలు చేయగా..ఈ కేసు ఆధారంగా కర్రీ అండ్ సెనైడ్ అనే డాక్యుమెంటరీ తెరకెక్కిన సంగతి విదితమే. అలాగే మనోజ్ బాజ్ పేయ్, కొంకణా సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కిల్లర్ సూప్. 2017లో తెలంగాణలో సంచలనం కలిగించిన నాగర్ కర్నూల్ స్వాతి ఘటన ఆధారంగా తెరకెక్కింది. ఇప్పుడు మరో రియల్ క్రైం కథ రూపుదిద్దుకోబోతుందని తెలుస్తుంది.

బాలీవుడ్ ప్రముఖ లేడీ దర్శకుల్లో ఒకరైన మేఘనా గుల్జర్ ఓ క్రైం స్టోరీని తెరకెక్కించబోతుందట. ఇందులో కరీనా కపూర్ , ఆయుష్మాన్ ఖురానా నటించబోతున్నారని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలనే కాదు దేశాన్ని కుదిపేసిన ఓ రియల్ క్రైమ్‌ కథను సినిమాగా తీయబోతుందట దర్శకురాలు. ఇంతకు అదేంటంటే.. దిశ హత్య కేసు. 2019లో తెలంగాణ రాజధాని హైదారాబాద్ సమీపంలోని శంషాబాద్ శివార్లలో జరిగిన 26 ఏళ్ల వెటర్నరీ వైద్యురాలిపై కొంత మంది యువకులు హత్యాచారానికి ఒడిగట్టిన సంగతి విదితమే. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీన్ రీ క్రియేషన్స్ పేరుతో తీసుకెళ్లగా.. పారిపోతున్నారన్న నెపంతో కాల్చి చంపిన సంగతి విదితమే. 2022లో సుప్రీంకోర్టు.. ఇది ఎన్ కౌంటర్ అని నిర్దారించింది.

ఇప్పుడు ఈ కథా వృత్తాంతాన్ని సినిమాగా తెరకెక్కించబోతుంది మేఘనా గుల్జర్. ఇప్పుడు ఈ క థకు మెరుగులు దిద్ది..కరీనా, ఆయుష్మాన్ ఖురానాకు వినిపించిందట డైరెక్టర్. ఇద్దరు అంగీకరించినట్లు తెలుస్తుంది. కాగా, కరీనా, ఖురానా ఇంత వరకు తెరపై జతకట్టలేదు. ఇదే వారికి తొలిసినిమా. ఈ ఏడాదిలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని సన్నాహాలు చేస్తున్నారు. 2024 ఇయర్ ఎండ్ కల్లా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, 2025లో థియేటర్లలోకి సినిమాను తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా, దిశ ఘటనపై తెలుగులో అనేక సినిమాలు వచ్చాయి కానీ అవి అంతగా ప్రభావితం చూపలేదు. ఇప్పుడు బాలీవుడ్ ఈ కథపై ఫోకస్ పెట్టడం.. స్టార్ దర్శకురాలు… యాక్టర్స్ నటించనుండటంతో సినిమాపై హైప్ పెంచుతుంది. ఇక మేఘనా గుల్జార్.. ప్రముఖ రచయిత, సాహితీ వేత్త గుల్జార్ కూతురు ఇండస్ట్రీలోకి వచ్చి మంచి దర్శకురాలిగా పేరు వచ్చింది. తల్వార్, రాజీ, చపాక్, సామ్ బహుదూర్ వంటి చిత్రాలు.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి