iDreamPost

సౌత్ డైరెక్టర్ ని లాక్ చేసుకున్న కింగ్ ఖాన్

సౌత్ డైరెక్టర్ ని లాక్ చేసుకున్న కింగ్ ఖాన్

2018లో జీరో లాంటి డిజాస్టర్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తో సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్న కింగ్ షారుఖ్ ఖాన్ ఇప్పుడో సౌత్ డైరెక్టర్ కు ఓకే చెప్పాడు . అతనే ఆట్లీ. రాజారాణితో తెలుగువాళ్ళకూ దగ్గరైన ఆట్లీ ఆ తర్వాత విజయ్ తో వరసగా మూడు బ్లాక్ బస్టర్స్ రూపొందించాడు. తేరి(పోలీసోడు), మెర్సల్(అదిరింది), బిగిల్(విజిల్) తమిళనాడులో వందల కోట్లు రాబట్టి ఆల్ టైం హిట్స్ గా నిలిచాయి. తెలుగులోనూ విజిల్ కు మంచి రెస్పాన్స్ తో పాటు కలెక్షన్స్ కూడా వచ్చాయి.

తెలిసిన కథలనే మాస్ హీరోల అభిమానులు మెచ్చేలా కమర్షియల్ మీటర్ తో బాగా తీస్తాడని పేరున్న ఆట్లీ బాలీవుడ్ దృష్టిలో పడటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఇప్పటికే స్టొరీ లాక్ అయ్యిందని కేవలం స్క్రిప్ట్ ఫైనల్ చేయడం కోసమే షారుఖ్ ఎక్కువ టైం తీసుకున్నాడని ఇన్ సైడ్ టాక్. ఇది ఆట్లీకే ఒకరకంగా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. షారుఖ్ ఖాన్ సినిమా అంటే నేషన్ వైడ్ రిలీజ్ తో పాటు భారీ ఓపెనింగ్స్ వస్తాయి.

గట్టిగా ప్రూవ్ చేసుకున్నాడా అక్కడే జెండా పాతేయవచ్చు. ప్రభుదేవా ఆరకంగానే అక్కడ సల్మాన్ ఖాన్ తో లాక్ అయిపోయాడు. షారుఖ్ మూవీ కోసం మూవీ లవర్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వరస పరాజయాలతో బెంబేలెత్తిపోయిన కింగ్ ఖాన్ సాలిడ్ కం బ్యాక్ తో రావాలని ఎదురు చూస్తున్నాడు. ఆట్లీ కూడా ఆ అంచనాలకు తగ్గట్టే దీన్ని రూపొందిస్తారట. హింది తమిళ్ లో బై లింగ్వల్ గా రూపొందే ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్ రూపంలో అందిస్తారు. పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడవుతాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి