iDreamPost

అల్లు అర్జున్ – అట్లీ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

  • Published Apr 02, 2024 | 4:59 PMUpdated Apr 02, 2024 | 4:59 PM

allu arjun Atlee Combo: దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్‌ ఒక సినిమాకి పని చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కన్ఫర్మ్ అయింది, కాగా స్క్రిప్ట్ వర్క్ చెన్నైలో జరుగుతోంది.

allu arjun Atlee Combo: దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్‌ ఒక సినిమాకి పని చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కన్ఫర్మ్ అయింది, కాగా స్క్రిప్ట్ వర్క్ చెన్నైలో జరుగుతోంది.

  • Published Apr 02, 2024 | 4:59 PMUpdated Apr 02, 2024 | 4:59 PM
అల్లు అర్జున్ – అట్లీ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మోస్ట్ అవైటడ్ సీక్వెల్ పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ఆగష్టు 15, 2024 న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు షారుఖ్‌ ఖాన్‌ తో ఇటీవలే జవాన్‌ వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్‌ ఒక సినిమాకి పని చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కన్ఫర్మ్ అయింది, కాగా స్క్రిప్ట్ వర్క్ చెన్నైలో జరుగుతోంది. కాగా ఈ సినిమా బడ్జెట్ దాదాపు 350 కోట్లు అని గట్టి టాక్ వినిపిస్తుంది.

తాజా వార్తల ప్రకారం అల్లు అర్జున్ – అట్లీల చిత్రం ఏప్రిల్ 8, 2024న అఫిషియల్ గా స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఈ తేదీ ఐకాన్ స్టార్ అభిమానులకు ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది అల్లు అర్జున్ పుట్టినరోజు కదా. అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మక హోమ్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కాగా సమంతా రుత్ ప్రభు, త్రిష వంటి స్టార్ హీరోయిన్స్ తో చిత్ర యూనిట్ చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అట్లీ ఇతర సినిమాల లానే ఈ సినిమా కూడా స్టైలైజ్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.

ఈ చిత్రం అక్టోబర్ నెలలో సెట్స్‌ పైకి వెళ్లనుంది. పుకార్లు మొదలైన రోజు నుండే ఈ చిత్రం వార్తల్లో నిలిచింది. పైన చెప్పుకున్న విధంగా దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. అట్లీ దక్షిణాదిలో ఎన్నడూ లేని భారీ స్థాయిలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ఈ చిత్రంతో పాటు పుష్ప 2 గురించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ కూడా ఏప్రిల్ 8న వెల్లడి కానున్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజున పుష్ప సీక్వెల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కాగా పుష్ప 2 సినిమాకి సంబందించిన ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ చేజిక్కించుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి