iDreamPost

సెలబ్రిటీల లైంగిక జీవితాల‌పై క‌రణ్ జోహార్ కు ఎందుకు అంత ఇంట్రెస్ట్? విజ‌య్ గ‌ట్టు దాటాడా? గుట్టు దాచాడా?

సెలబ్రిటీల లైంగిక జీవితాల‌పై క‌రణ్ జోహార్ కు ఎందుకు అంత ఇంట్రెస్ట్? విజ‌య్ గ‌ట్టు దాటాడా?  గుట్టు దాచాడా?

కర‌ణ్ జోహార్ షో కాపీ విత్ క‌ర‌ణ్ ట్రెండింగ్ లో ఉంటోంది. ముందు స‌మంత ఈ షోకు ఊపునిస్తే, ఇప్పుడు విజ‌య దేవ‌ర‌కొండ‌ నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ట్రైల‌ర్ కంటెంటే వివాదాలను సృష్టిస్తోంది. కాఫీ విత్ కరణ్ సీజన్ 7 యొక్క మొదటి ఎపిసోడ్‌లో అలియా భట్-రణ్‌వీర్ సింగ్ , ఇతర ఎపిసోడ్‌లలో జాన్వీ కపూర్-సారా అలీ ఖాన్ , అక్షయ్ కుమార్-సమంత లు వ్యక్తిగత విష‌యాన‌లు బైట‌పెట్టారు. సెల‌బ్రిటీ వృత్తిగ‌త ర‌హ‌స్యాల‌ను బైట‌పెట్టారు.

ఇక‌, కరణ్ జోహార్ చాట్ షోలో లేటెస్ట్ ఎపిసోడ్ అనన్య పాండే , విజయ్ దేవరకొండది. ఇప్పుడు క‌ర‌ణ్ జోహార్ షో కాస్త శృతిత‌ప్పిన‌ట్లే క‌నిపిస్తోంది. వ‌చ్చిన గెస్ట్ ల‌ను కాస్త మురిపిస్తాడు. హాట్ డైలాగ్స్ ఎలాగూ ప‌డ‌తాయి. వాళ్లు గుట్టు విప్పుతారు. ప‌క్క సెలబ్రిటీల మీద కామెంట్ కూడా చేస్తారు. ఇవ‌న్నీ కొన్నిసార్లు ప్రేక్షకులకు న‌చ్చుతాయి. ఇది బాలీవుడ్ స్టైల్ టాక్ షో.

ఇలాంటి షోలో విజ‌య్ దేవ‌ర‌కొండ ( Vijay Deverakonda) శృంగారం చేశాన‌ని ఒప్పుకోవ‌డం ఫ్యాన్స్ ను బాగా చికాకుపెట్టింది. ఎప్పుడూ ఈ గోలేనా?

విజయ్ దేవరకొండ – అనన్య పాండేల ఎపిసోడ్ ‘సెక్స్ గురించి మాత్రమే’ అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ సూప‌ర్ స్టార్, త‌ప్పుడు వ్య‌క్తుల ప్ర‌భావంతో ప్ర‌భావంతో ఏది చెప్పాలో, ఏది చెప్ప‌కూడ‌దో మ‌ర్చిపోయాడు. రహస్యంగా ఉంచాల్సిన విషయాల గురించి మాట్లాడ‌టం కొంద‌రి ఫ్యాన్స్ కు విసుగుతెప్పించింది.


క‌రణ్ జోహార్ KWKలో విజయ్ దేవరకొండ – అనన్య పాండే వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశాడు. సీరియ‌స్ క్వ‌శ్చ‌న్. మీకు నచ్చిందా ? అప్పుడు మీరు #HotstarSpecials #KoffeeWithKaranS7 ఎపిసోడ్ 4ని బాగా ఇష్టపడతారు. ఈ గురువారం డిస్నీ+ హాట్‌స్టార్‌లో మాత్రమే అని పోస్ట్ చేశాడు.

చిన్న క్లిప్‌లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే లు కరణ్ జోహార్ క్వ‌శ్చ‌న్స్ కి అన్స‌ర్లు ఇచ్చారు. నువ్వు త్రీసోమ్ చేయాలనుకుంటున్నారా అని లైగ‌ర్ హీరోని అడిగాడు. కారులో శృంగారం చేశాన‌ని విజ‌య్ ఒప్పుకున్నాడు. అక్క‌డితో ఆగిఉంటే బాగుండేది. కాని ముగ్గురితో కలిసి పాల్గొనడం తనకు అభ్యంతరం లేదని చెప్పాడు. అందుకే చిర్రెత్తుకొచ్చిన ఒక యూజ‌ర్, ఈ షోకి ‘సెక్స్ టాక్ విత్ కరణ్’ అని పేరు పెట్టాల‌ని కామెంట్ చేశాడు.

ఇంకో యూజ‌ర్ మ‌రింత కోపాన్ని చూపించాడు. “మీకు ముగ్గురు వ్యక్తులు ఉన్నారా? శృంగారం చేయ‌డాన్ని మీరు వినోదంగా భావిస్తున్నారా అని ప్ర‌శ్నించాడు. వినోదం, TRP పేరుతో నేష‌న‌ల్ OTTలో ఏమి మాట్లాడుతున్నారో మ‌రో యూజ‌ర్ ఆశ్చ‌ర్య‌పోయాడు.

కాఫీ విత్ కరణ్ సీజన్ 7 Gen Z త‌రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కున్న క్రేజ్ ను ప‌ట్టిచూపించింది. ఇక్క‌డో మ‌రో వాద‌న‌కూడా వినిపిస్తోంది. కొన్ని విష‌యాలు బైట‌పెట్టినా, సారా అలీ ఖాన్ , జాన్వీ కపూర్‌ల గురించి చాలా సింపుల్ గా మాట్లాడాడు. క‌ర‌ణ్ జోహార్ మాత్రం హాట్ విష‌యాల‌ను బైట‌పెట్టాల‌ని కోరుకున్నాడు. కాని విజ‌య్ మాత్రం పెద్ద‌గా మ‌న‌సు విప్ప‌లేదు. గౌర‌వంగానే, ఒక మ‌ధ్య‌త‌ర‌గ‌తి హీరోగానే బిహేవ్ చేశాడ‌ని ఫ్యాన్స్ అంటున్నారు. అది నిజ‌మే కావ‌చ్చు.

Liger సినిమాకు Puri Jagannadh డైరెక్ట‌ర్. Vijay Deverakonda boxerగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాను Karan Johar, Puri Jagannadh, Charmme Kaur క‌ల‌సి నిర్మిస్తున్నారు. Ananya Pandayకి ఇదే తొలి తెలుగు సినిమా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి