iDreamPost

బుమ్రా విషయంలో తప్పు చేస్తున్నారా? రోహిత్‌ను కడిగిపారేస్తానన్న కపిల్‌ దేవ్‌

  • Published Jun 12, 2024 | 3:21 PMUpdated Jun 12, 2024 | 3:21 PM

Kapil Dev, Jasprit Bumrah, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో బుమ్రా విషయంలో జరుగుతున్న ఓ తప్పుపై రోహిత్‌ శర్మతో మాట్లాడి తేల్చుకుంటా అంటూ కపిల్‌ దేవ్‌ గట్టి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Kapil Dev, Jasprit Bumrah, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో బుమ్రా విషయంలో జరుగుతున్న ఓ తప్పుపై రోహిత్‌ శర్మతో మాట్లాడి తేల్చుకుంటా అంటూ కపిల్‌ దేవ్‌ గట్టి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 12, 2024 | 3:21 PMUpdated Jun 12, 2024 | 3:21 PM
బుమ్రా విషయంలో తప్పు చేస్తున్నారా? రోహిత్‌ను కడిగిపారేస్తానన్న కపిల్‌ దేవ్‌

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఇప్పటికే రెండు వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న టీమిండియా.. ఈ రోజు మూడో మ్యాచ్‌కు సిద్ధం అవుతుంది. న్యూయార్క్‌ వేదికగా యూఎస్‌ఏతో భారత్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. రోహిత్‌ సేన సూపర్‌ 8కు అర్హత సాధిస్తుంది. అయితే.. ఈ కీలక మ్యాచ్‌కి ముందు టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా స్టార్‌ బౌలర్‌ బుమ్రా విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎందుకు ఆ తప్పు చేస్తుందో నేరుగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతోనే తేల్చుకుంటానంటూ పేర్కొన్నారు. ఇంతకీ బుమ్రా విషయంలో టీమిండియా చేస్తున్న తప్పు ఏంటి? రోహిత్‌తో కపిల్‌ దేవ్‌ ఏం తేల్చుకుంటాను అన్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జస్ప్రీత్‌ బుమ్రా.. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో నంబర్‌ వన్‌ బౌలర్‌గా ఉన్న విషయం తెలిసిందే. తన సూపర్‌ బౌలింగ​్‌తో ఇప్పటికే టీమిండియా రెండు విజయాలు అందించాడు. ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా గెలిచిన రెండు మ్యాచ్‌ల్లోనూ బుమ్రానే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌పై 2, పాక్‌పై 3 వికెట్లు పడగొట్టాడు. మెయిన్‌ వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌గా ఉన్న బుమ్రాను ఎదుర్కొనేందుకు ‍ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయి. ఇలాంటి బౌలర్‌తో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలి ఓవర్‌ వేయించడం లేదు. కొంత బంతిని బుమ్రా చేతికి ఇవ్వడం లేదు. ఇలా ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని కపిల్‌ దేవ్‌ అంటున్నారు. ఈ విషయంపై రోహిత్‌ను అడుగుతానని బుమ్రా లాంటి​ బౌలర్‌తో ఎందుకు ఫస్ట్‌ ఓవర్‌ వేయించడం లేదు అని గట్టిగా అడుగుతానని కపిల్‌ దేవ్‌ అన్నారు.

బుమ్రా లాంటి వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌తో తొలి ఓవర్‌ వేయిస్తే.. ఎంతో ఉపయోగం ఉంటుంది. టీ20 క్రికెట్‌లో ఆరంభంలోనే వికెట్లు తీస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెట్టవచ్చు. అలా కాకుండా బుమ్రాను మూడో ఛాయిస్‌ కింద, అర్షదీప్ సింగ్‌, సిరాజ్‌ వేసిన తర్వాత.. 4 ఓవర్‌లోనో, 5 ఓవర్‌లోనో బౌలింగ్‌కు దింపడం వల్ల కొన్ని సార్లు టీమిండియాకు ఇబ్బంది తప్పకపోవచ్చు, బుమ్రా రాక ఆసల్యం అయితే ఆలోపు మ్యాచ్‌ టీమిండియా చేతి నుంచి జారిపోవచ్చు అని కపిల్‌ దేవ్‌ అన్నారు. అయితే.. బయటి నుంచి చూస్తే మనకు ఏదైనా అనిపించవచ్చు అని.. అలా కాకుండా నేరుగా రోహిత్‌ను కలిసి ఈ విషయంపై అడిగితే వాళ్ల స్ట్రాటజీ ఏంటో మనకు తెలుస్తుందని కపిల్‌ దేవ్‌ అన్నారు. మరి బుమ్రాతో తొలి ఓవర్‌ వేయించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి