iDreamPost
android-app
ios-app

ఆడిషన్స్ కి పిలిచి లైం*గిక వేధింపులు.. తెలుగు సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్!

Famous Serial Artist Complaint Lodged: ఇండస్ట్రీలో ప్రముఖంగా కాస్టింగ్ కౌచ్ అనే పదం మాత్రం వినిపిస్తూనే ఉంది. తాజాగా ప్రముఖ తెలుగు సీరియల్ ఆర్టిస్ట్ తనకి ఎదురైన చేధు అనుభవం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.

Famous Serial Artist Complaint Lodged: ఇండస్ట్రీలో ప్రముఖంగా కాస్టింగ్ కౌచ్ అనే పదం మాత్రం వినిపిస్తూనే ఉంది. తాజాగా ప్రముఖ తెలుగు సీరియల్ ఆర్టిస్ట్ తనకి ఎదురైన చేధు అనుభవం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆడిషన్స్ కి పిలిచి లైం*గిక వేధింపులు.. తెలుగు సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్!

భాషతో సంబంధం లేకుండా అందరికీ సీరియల్స్ అంటే ఇష్టం మాత్రమే కాదు.. ప్రాణం అని చెప్పాలి. తెలుగు బుల్లితెర ఫ్యాన్స్ కి అయితే సీరియల్స్ అంటే ఒక ఎమోషన్ అనే చెప్పాలి. అయితే ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే ఆర్టిస్టులకు కూడా కెరీర్ లో చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి. వాళ్లు కూడా పలు సందర్భాల్లో తమకు ఎదురైన కష్టాలను చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా ప్రముఖ తెలుగు సీరియల్ నటి తనకు ఎదురైన ఛేదు అనుభవం గురించి ప్రస్తావించింది. తనను సినిమా ఆడిషన్ కి అని పిలిచి లైం*గికంగా వేధింపులకు గురి చేశారు అంటూ కామెంట్స్ చేసింది. అతనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

బుల్లితెర అయినా.. వెండితెర అయినా ప్రముఖంగా కాస్టింగ్ కౌచ్ అనే పదం బాగా వినిపిస్తూ ఉంటుంది. బడా బడా స్టార్ హీరోయిన్స్ కూడా తాము కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాం అంటూ పలు సందర్భాల్లో తమ అనుభవాలను పంచుకున్నారు. తాజాగా కన్నడ బుల్లితెర నటి అమూల్య గౌడ తనకు ఎదురైన ఇబ్బంగి గురించి వెల్లడించడమే కాకుండా.. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తామంటూ నమ్మించి అసభ్యంగా మెసేజ్లు పంపినట్లు ఆరోపించింది. ఈ విషయానికి సంబంధించి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూర్య అనే వ్యక్తి తనని ఆడిషన్స్ కి అని పిలిచి లైం*గికంగా వేధించాడంటూ అమూల్య గౌడ ఆరోపణలు చేసింది.

కాస్టింగ్ డైరెక్టర్ అంటూ పరిచయం చేసుకున్న సూర్య తనకు ఓ సినిమాలో అవకాశం ఇస్తానంటూ నమ్మబలికాడంటూ చెప్పుకొచ్చింది. అతను తనకు వాట్సాప్ లో అసభ్యకరంగా సందేశాలు పంపినట్లు తెలిపింది. అతని దారుణమైన ప్రవర్తనకు సంబంధించి అతడిని నిలదీస్తే పోలీసులకు చెప్పుకుంటే.. చెప్పుకో అంటూ వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ అమ్మడు కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా ప్రముఖ సీరియల్స్ లో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. కన్నడ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. తెలుగులో గుండెనిండా గుడి గంటలు అనే సీరియల్ లో మీనా పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.

అమూల్య గౌడ చేస్తున్న గుండెనిండా గుడి గంటలు సీరియల్ కు మంచి ఆదరణ కూడా లభిస్తోంది. ఇష్టంలేని పెళ్లి చేసుకున్న భర్తను తన ప్రేమతో తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉంటుంది. ఎంతో మంచి వాడు అయిన తన భర్త ఎప్పటికైనా తన ప్రేమను అర్థం చేసుకోకపోతాడా? తనని తిరిగి ప్రేమించకపోతాడా? అంటూ ఎదురుచూస్తూ ఉండే మీనా పాత్రలో అందరినీ మెప్పిస్తోంది. అలాంటి ఒక ప్రముఖ నటికి కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడంపై అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. అమూల్య గౌడకు ఇలాంటి చేధు అనుభవం ఎదురు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobetjojobet girişjojobetjojobet girişjojobetjojobet girişjojobet güncel giriş