iDreamPost

Kane Williamson: ఓటమి బాధలో కేన్ మామ సంచలన నిర్ణయం! హ్యాట్సాఫ్ అంటున్న క్రికెట్ లవర్స్..

టీ20 వరల్డ్ కప్ 2024లో దారుణ ప్రదర్శన కారణంగా లీగ్ దశలోనే నిష్క్రమించింది న్యూజిలాండ్. ఇక ఈ మెగాటోర్నీలో జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ.. రెండు సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు కేన్ విలియమ్సన్. మరి ఆ నిర్ణయాలు ఏంటి? తెలుసుకుందాం పదండి.

టీ20 వరల్డ్ కప్ 2024లో దారుణ ప్రదర్శన కారణంగా లీగ్ దశలోనే నిష్క్రమించింది న్యూజిలాండ్. ఇక ఈ మెగాటోర్నీలో జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ.. రెండు సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు కేన్ విలియమ్సన్. మరి ఆ నిర్ణయాలు ఏంటి? తెలుసుకుందాం పదండి.

Kane Williamson: ఓటమి బాధలో కేన్ మామ సంచలన నిర్ణయం! హ్యాట్సాఫ్ అంటున్న క్రికెట్ లవర్స్..

టీ20 వరల్డ్ కప్ 2024లో న్యూజిలాండ్ గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఐసీసీ టోర్నీల్లో ఇప్పటి వరకు కివీస్ ఇలా గ్రూప్ దశలోనే వెనుదిరగడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మెగాటోర్నీలో వెస్టిండీస్, ఆఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయి.. వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక ఈ ఓటమికి కారణాలు సైతం వెల్లడించాడు కెప్టెన్ కేన్ విలియమ్సన్. ఈ క్రమంలోనే ఓ సంచలన నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అది షాకింగ్ డెసిషనే అయినప్పటికీ.. క్రికెట్ లవర్స్ మాత్రం హ్యాట్సాఫ్ అంటున్నారు. మరి ఇంతకీ కేన్ మామ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? తెలుసుకుందాం పదండి.

ఈ వరల్డ్ కప్ లో దారుణ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది పటిష్ట న్యూజిలాండ్ టీమ్. వెస్టిండీస్, ఆఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయి.. చరిత్రలో చెత్త రికార్డును నమోదు చేసింది. ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో కివీస్ ఇలా గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టడం ఇదే తొలిసారి. ఇక ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండు సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. అందులో ఒకటి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, ఇంకోటి సెంట్రల్ కాంట్రాక్ట్ ను తిరస్కరించడం. అవును న్యూజిలాండ్ జాతీయ కాంట్రాక్ట్ ను కేన్ మామ తిరస్కరించాడు. అందుకు  ఓ గొప్ప కారణం కూడా చెప్పాడు.

తాను సెంట్రల్ కాంట్రాక్ట్ తీసుకోకపోతే.. తన ప్లేస్ లో ఎంతో మంది యంగ్ స్టర్స్ ఆ అవకాశాన్ని దక్కించుకుంటారని, కివీస్ కు మూడు ఫార్మాట్స్ లో ఆడే అద్భుతమైన ప్లేయర్లు ప్రస్తుతం ఉన్నారని,  అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు విలియమ్సన్. యంగ్ ప్లేయర్ల కోసం ఆలోచించి.. ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం పట్ల క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేన్ మామ తీసుకున్న డెసిషన్ కు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఒకవైపు కెప్టెన్ గా దిగిపోవడం, సెంట్రల్ కాంట్రాక్ట్ ను తిరస్కరించడంతో అతడి అభిమానులు షాక్ కు గురైయ్యారు. కాగా.. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే కాక.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కివీస్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. మరి ఈ న్యూజిలాండ్  దిగ్గజం తీసుకున్న నిర్ణయాలపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి