iDreamPost

ప్రజాకవి కాళోజీ కుమారుడు రవికుమార్‌ మృతి!

ప్రజాకవి కాళోజీ కుమారుడు రవికుమార్‌ మృతి!

తెలంగాణ పోరాట యోధుడు.. నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వతంత్ర సమరయోధుడు, పద్మవిభూషన్ అవార్డు గ్రహీత కాలోజీ నారాయణరావు. తన కలంతో కోట్లమంది తెలంగాణ ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపారు. మన నీరు, మన భూమి, మన పాలన మనకే కావాలే.. అంటూ ఎంతోమంది తెలంగాణ వీరులను మేల్కొలిపారు… తెలంగాణ సాధనకు ఆజ్యం పోశారు. ప్రజా కవి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. హనుమకొండ జిల్లా దామెర కాలోజీ జయంతి మర్నాడే ఆయన కుమారుడు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ప్రజాకవిగా కోట్ల మందికి గుండెల్లో నిలిచిపయిన కాలోజీ నారాయణరావు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన ఏకైక కుమారుడు రవి కుమార్(68) ఆదివారం కన్నుమూశారు. హనుమకొండ జిల్లా నక్కలగుట్టలో నివాసం ఉంటున్న రవి కుమార్ ఆంధ్రా బ్యాంకులో క్లర్కుగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆయనకు భార్య వాణిదేవి, కుమారుడు సంతోష్ కుమార్ ఉన్నారు. గతంలో కర్ణాటక నుంచి వరంగల్ కి తరలి వచ్చిన కాలోజీ కుటుంబం ఇక్కడే స్థిరపడింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కాలోజీ కీలక పాత్ర పోషించారు. తన కలంతో ఎంతోమందికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపారు.

ఈ నెల 5న రవి కుమార్ కి తీవ్ర జ్వరం, మూత్ర సంబంధితన వ్యాధి తో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు. ఆదివారం ఆయన పరిస్థితి మరింత విషమించి చికిత్స పొందుతూ చనిపోయారు. రవి కుమార్ నేత్రాలను కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. నేడు పద్మాక్షి చెరువు సమీపంలోని శివ ముక్తిస్థల్ లో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. కాలోజీ జయంతిని సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవంంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 9 కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజానికం ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. ఆ మరుసటి రోజే సెప్టెంబర్ 10న ఆయన తనయుడు రవికుమార్ కన్నుమూయడం కుటుంబ సభ్యుల్లో, సాహిత్య అభిమానుల్లో విషాదం నింపింది. రవి కుమార్ మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి