iDreamPost

‘KALKI 2898 ఏడీ’ ట్రైలర్​పై అప్​డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్.. వచ్చేది ఆ రోజునే..!

  • Published Dec 29, 2023 | 7:24 PMUpdated Dec 29, 2023 | 7:24 PM

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గుడ్ న్యూస్ చెప్పారు. డార్లింగ్ నెక్స్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ ఏ రోజున వస్తుందో ఆయన క్లారిటీ ఇచ్చారు.

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గుడ్ న్యూస్ చెప్పారు. డార్లింగ్ నెక్స్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ ఏ రోజున వస్తుందో ఆయన క్లారిటీ ఇచ్చారు.

  • Published Dec 29, 2023 | 7:24 PMUpdated Dec 29, 2023 | 7:24 PM
‘KALKI 2898 ఏడీ’ ట్రైలర్​పై అప్​డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్.. వచ్చేది ఆ రోజునే..!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నారు. ఆయన నటించిన ‘సలార్’ బ్లాక్​బస్టర్ హిట్​గా నిలిచింది. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రన్​ను కంటిన్యూ చేస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్​లోకి ఎంట్రీ ఇచ్చిన ‘సలార్’.. ఫుల్ రన్​లో ఇంకెంత కలెక్ట్ చేస్తుందనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. రిలీజై వారం గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ మేనియా ఇంకా అలాగే ఉంది. డార్లింగ్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ప్రభాస్ మాస్ హీరోయిజంను స్క్రీన్​ మీద మళ్లీ చూసేందుకు రిపీటెడ్​గా థియేటర్లకు వస్తున్నారు. దీంతో ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ తరుణంలో రెబల్ స్టార్ అభిమానులుకు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్ అప్​డేట్ ఇచ్చారు. ప్రభాస్ యాక్ట్ చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆయన క్లారిటీ ఇచ్చారు.

సైన్స్ ఫిక్షన్ జోనర్​లో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్, టీజర్ వచ్చాయి. వాటికి పాజిటివ్ టాక్ రావడంతో ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. చాన్నాళ్లుగా ‘కల్కి’ నుంచి అప్​డేట్ రాకపోవడంతో ఫిల్మ్ పోస్ట్​పోన్ అవుతుందేమోననే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే వీటికి చెక్ పెడుతూ ట్రైలర్ మీద అప్​డేట్ ఇచ్చారు ఆ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ చిత్రం ట్రైలర్​ను 2024, ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పారు. ఐఐటీ బాంబే టెక్​ ఫెస్ట్​-23లో గెస్ట్​గా పాల్గొన్న నాగ్ అశ్విన్.. స్టూడెంట్స్​తో చిట్​చాట్​ సందర్భంగా పలు ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఓ వ్యక్తి అడిగిన క్వశ్చన్​కు సమాధానంగా ‘కల్కి’ ట్రైలర్ ఎప్పుడు వచ్చేది క్లారిటీ ఇచ్చేశారు.

prabhas kalki trailer

బాలీవుడ్ టాప్ స్టార్స్ దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్​తో పాటు లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ ‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫిల్మ్ నుంచి మేకర్స్ లాంఛ్ చేసిన కల్కి రైడర్స్ (యూనిఫార్మ్​డ్ విలన్ ఆర్మీ) కాస్టూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియో సినిమా మీద ఎక్స్​పెక్టేషన్స్​ను అమాంతం పెంచేసంది. శుక్రవారం ముంబై ఐఐటీలో నాగ్ అశ్విన్ పాల్గొన్న టైమ్​లోనూ కల్కి రైడర్స్ హల్​చల్​ చేశారు. ఇక, ‘సలార్’ సూపర్ హిట్టవ్వడంతో సంతోషంలో మునిగిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్​.. ఇప్పుడు ‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా తెలియడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీతో ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్​గా మారతారని అంటున్నారు. ఏప్రిల్ 1 వరకు తాము ఎదురు చూడలేమని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే మరో 93 రోజులు వాళ్లకు వెయిటింగ్ తప్పేలా లేదు. మరి.. ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ చూసేందుకు మీరెంత ఆసక్తిగా ఉన్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IMDB టాప్-250 ఇండియన్ మూవీస్​.. లిస్ట్​లోని తెలుగు సినిమాలు ఇవే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి