iDreamPost

పొత్తు పెట్టిన చిచ్చులు.. YCPలో చేరిన వేల మంది జనసైనికులు

  • Published Feb 26, 2024 | 11:12 AMUpdated Feb 26, 2024 | 11:12 AM

టీడీపీ-జనసేన సీట్ల పంపకం.. ఇరు పార్టీల్లో అసంతృప్త జ్వాలలను రగిల్చింది. పవన్‌ కళ్యాణ్‌ తీరుపై ఆగ్రహంగా ఉన్న జనసేన కార్యకర్తలు వేలాది మంది వైసీపీలో చేరారు. ఆ వివరాలు..

టీడీపీ-జనసేన సీట్ల పంపకం.. ఇరు పార్టీల్లో అసంతృప్త జ్వాలలను రగిల్చింది. పవన్‌ కళ్యాణ్‌ తీరుపై ఆగ్రహంగా ఉన్న జనసేన కార్యకర్తలు వేలాది మంది వైసీపీలో చేరారు. ఆ వివరాలు..

  • Published Feb 26, 2024 | 11:12 AMUpdated Feb 26, 2024 | 11:12 AM
పొత్తు పెట్టిన చిచ్చులు.. YCPలో చేరిన వేల మంది జనసైనికులు

రానున్న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తాజాగా రెండు రోజుల క్రితం ఈ కూటమి తొలి జాబితాని ప్రకటించింది. రెండు పార్టీల నుంచి 118 మంది అభ్యర్థుల లిస్ట్‌ను వెల్లడించింది. 118 లో జనసేనకు 24 సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక టీడీపీ తన 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన మాత్రం కేవలం 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా బీజేపీతో చర్చలు ఓ కొలిక్కి రాలేదు. దానిపై ఓ క్లారిటీ వచ్చాక.. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుంది అనే విషయం తెలియనుంది.

ఇదిలా ఉండగా.. సీట్ల పంపకం ఇరు పార్టీల్లో చిచ్చు పెట్టింది. జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య సైతం.. పవన్‌ కళ్యాణ్‌ని ప్రశ్నిస్తూ.. బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇదేం పొత్తు ధర్మం.. జనసేన కేవలం 24 టికెట్లకు మాత్రమే అంగీకరించడం ఏంటి.. అంటే ఆ పార్టీ అంతకు మించి స్థానాల్లో విజయం సాధించలేదా అంటూ హరిరామ జోగయ్య ప్రశ్నించారు. ఇక టికెట్‌ ఆశించిన పలువురు జనసేన నేతలకు పవన్‌ హ్యాండిచ్చారు. ఈ క్రమంలో తాజాగా కాకినాడ జనసైనికులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

పొత్తులో భాగంగా సీట్ల ప్రకటనతో మనస్తాపం చెందిన జనసైనికులు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా కాకినాడలో వేల మంది జనసైనికులు.. ర్యాలీగా వెళ్లి అధికార వైసీపీలో చేరారు. జనసేన అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం తమకు నచ్చలేదని.. ఐదేళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికి పవన్‌ కళ్యాణ్‌ హ్యాండిచ్చాడు అంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 24 సీట్లతో ఎలాంటి మార్పు తీసుకురాగలరో చెప్పాలని కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచేలా ఉన్న పవన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తామంతా వైసీపీలో చేరుతున్నానమని ఈ సందర్భంగా వారు ప్రకటించారు.

ఇక జగ్గంపేట సీటును ఆశించిన జనసేన నేత పాఠంశెట్టి సూర్యచంద్రకు పవన్‌ హ్యాండిచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా జగ్గంపేట సీటును తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించారు. దాంతో జనసేన నేత సూర్యచంద్ర తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. రోడ్డుపైనే కన్నీరు పెట్టుకున్నాడు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ తనకు పవన్‌ ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాక తనకు కాకుండా జగ్గంపేట సీటును టీడీపీకి కేటాయిండంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి