iDreamPost

భర్త కళ్లు గప్పి ప్రియుడితో భార్య షికారు.. షాకింగ్ న్యూస్ ఏంటంటే?

కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ భర్త కళ్లు గప్పి ప్రియుడితో తిరిగింది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ఇది నచ్చని అతని భార్య కిరాతకానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?

కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ భర్త కళ్లు గప్పి ప్రియుడితో తిరిగింది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ఇది నచ్చని అతని భార్య కిరాతకానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?

భర్త కళ్లు గప్పి ప్రియుడితో భార్య షికారు.. షాకింగ్ న్యూస్ ఏంటంటే?

ఈ మధ్యకాలంలో కొందరు దంపతులు ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాలకు అలవాటు పడుతున్నారు. కొందరు భార్యలు అయితే ఏకంగా భర్త కళ్లు గప్పి ప్రియుడితో షికారులు చేస్తుంటారు. ఇక అసలు విషయం వెలుగులోకి రావడంతో ఊహించని దారుణాలకు పాల్పడుతూ చివరికి జైల్లో చిప్పకూడు తింటున్నారు. ఈ రోజుల్లో జరుగుతున్న నేరాలు, ఘోరాలు కూడా ఇలాంటివే. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత భర్త కళ్లు గప్పి ప్రియుడితో తిరిగింది. అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆ మహిళ పథకం ప్రకారం కిరాతకానికి ఒడిగట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కాకినాడ జిల్లా ఎస్.రాయవరం గ్రామంలో కొండలరావు(49)-ఉమా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు, కుమారుడు సంతానం. ఇక అప్పటి నుంచి ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే కొనసాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. రాను రాను ఉమా తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసింది. విషయం ఏంటంటే? సురవరం గ్రామానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తితో ఉమా వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. భర్త కళ్లు గప్పి ప్రియుడితో షికారులకు వెళ్లేది. అలా కొంత కాలం పాటు వీరి అక్రమ సంబంధం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతూ వచ్చింది.

ఇకపోతే.. భార్య వివాహేతర సంబంధం ఇటీవల ఆమె భర్త కొండలరావుకి తెలిసింది. బుద్ది మార్చుకోవాలంటూ భర్త భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. ఇంతే కాకుండా పూలపర్తికి మకాం మార్చాడు. ఇక్కడే అతని భార్య ఉమాకు నచ్చలేదు. ప్రియుడితో కలిసే వీలు లేకపోవడంతో ఉమాకు భర్తపై కోపం పెరిగిపోయింది. ఇలా అయితే కాదని, ఎలాగైన సరే భర్తను హత్య చేయాలని భావించింది. ఇందులో భాగంగానే ఉమా తన ప్రియుడైన చిరంజీవితో చేతులు కలిపి ఈ నెల 7వ తేదిన కొండలరావును హత్య చేయించింది. ఆ తర్వాత మృతదేహాన్ని గోదావరి నదిలో పడేసి చేతులు దులుపుకున్నారు.

ఇక ఏం తెలియనట్లుగా ఉమా నాటకం ఆడుతూ.. ఈ నెల ఏడవ తేదీ నుంచి నా భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా కొండలరావు హత్యకు గురయ్యాడని తేలింది. ఈ క్రమంలోనే పోలీసులు మృతుడి భార్యను విచారించగా.. నా భర్తను ప్రియుడితో చేతులు కలిపి హత్య చేయించానని నేరాన్ని ఒప్పుకుంది. ఆ తర్వాత పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రధాన నిందితురాలైన ఉమాతో పాటు ఆమె ప్రియుడు చిరంజీవి, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రియుడితో కలిసుండేందుకు కట్టుకున్న భర్తను కాటికి పంపిన ఈ దుర్మార్గురాలి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.