iDreamPost
android-app
ios-app

ఆ విషయంలో టాలీవుడ్ మరీ దారుణం.. మార్పు రావాలి: కాజల్

Kajal Aggarwal Comments On Tollywood టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. పెళ్లైన తర్వాత కూడా ఫుల్ సినిమాలతో బిజీగా మారిన ఈ బ్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్ పై విమర్శలు చేసింది.

Kajal Aggarwal Comments On Tollywood టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. పెళ్లైన తర్వాత కూడా ఫుల్ సినిమాలతో బిజీగా మారిన ఈ బ్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్ పై విమర్శలు చేసింది.

ఆ విషయంలో టాలీవుడ్ మరీ దారుణం.. మార్పు రావాలి: కాజల్

పరాయి ఇండస్ట్రీలో అడపా దడపా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మల్ని టాలీవుడ్ ఇండస్ట్రీ ఆఫర్లు ఇచ్చి స్టార్ హీరోయిన్లు చేస్తుంది. ఇక్కడ స్టార్ డమ్ చూశాక.. మరో పరిశ్రమకు వెళ్లాక టాలీవుడ్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారు. తాప్సీ, రాధికా ఆప్టే నుండి మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ వరకు టాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పించిన వారే. తాజాగా వారి జాబితాలోకి చేరింది చందమామ కాజల్ అగర్వాల్. 2004లో హిందీలో ఓ సపోర్టింగ్ రోల్‌లో కనిపించిన ఈ బ్యూటీ.. కట్ చేస్తే 2007లో తెలుగు సినిమాతో హీరోయిన్ అయ్యింది. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం నటనకు బీజం పడగా.. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో చందమామ చిత్రంలో మహాలక్ష్మిగా అలరించింది. అప్పటి నుండి టాలీవుడ్ చందమామగా మారిపోయింది.

మగధీరతో స్టార్ హీరోయిన్‌గా మారి.. తెలుగులో టాప్ ప్లేసుకు చేరుకుంది. తమిళ్, తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా మారింది. అలాగే హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సత్తా చాటింది. 2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. వీరికి ఓ బిడ్డ ఉన్న సంగతి విదితమే. పెళ్లి తర్వాత మోసగాళ్లు, భగవంత్ కేసరి సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సత్యభామ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా మే 31న విడుదల కానుంది. అఖిల్ డేగల డైరెక్టర్ కాగా, నవీన్ చంద్ర హీరో. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది కాజు పాప. ఈ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేసింది. ఇంతకు ఆమె ఏమన్నదంటే..?

పెళ్లి, బాబు పుట్టాక తన కెరీర్‌లో ఎలాంటి మార్పు రాలేదన్న కాజల్.. ఓ విషయంపై బాలీవుడ్ ఇండస్ట్రీతో టాలీవుడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీని పోల్చి చూసింది. ‘బాలీవుడ్‌లో పెళ్లైన హీరోయిన్స్ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ విషయంలో టాలీవుడ్‌లో ఎలాంటి మార్పు రాలేదు. ఇక్కడ పెళ్లైన నటీమణులకు సినిమాల్లో ఛాన్సులు ఇచ్చేందుకు మేకర్స్ చాలా ఆలోచిస్తున్నారు. త్వరలో ఇక్కడ కూడా అలాంటి మార్పు వస్తుందని ఆశిస్తున్నాను’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే తన ఉద్దేశం కరెక్టే అయినప్పటికీ.. కొంత మంది టాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు చేసిందంటూ మండిపడుతున్నారు. కాగా, ప్రస్తుతం కాజల్ అగర్వాల్.. ఇండియన్ 2, ఉమ అనే చిత్రాల్లో నటిస్తోంది. ఇండియన్ 2 ఈ ఏడాది విడుదల కానుంది.

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet