iDreamPost

నా కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది.. అతను నాకు వెన్నుపోటు పొడిచాడు: కడియం శ్రీహరి

  • Published Apr 13, 2024 | 7:52 AMUpdated Apr 13, 2024 | 7:52 AM

Kadiyam Srihari: లోక్ సభ ఎన్నికల వేళ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాలు..

Kadiyam Srihari: లోక్ సభ ఎన్నికల వేళ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాలు..

  • Published Apr 13, 2024 | 7:52 AMUpdated Apr 13, 2024 | 7:52 AM
నా కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది.. అతను నాకు వెన్నుపోటు పొడిచాడు: కడియం శ్రీహరి

సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతో పొలిటికల్ వాతావరణం హీటెక్కుతుంది. తెలంగాణలో అయితే పరిస్థితి పూర్తిగా తారుమారయ్యింది. లోక్ సభ ఎన్నికల ముందు పలువురు బీఆర్ఎస్ నేతలు పార్టీ మారడం.. అధికార కాంగ్రెస్ లో చేరడంతో.. ఇక్కడ రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. ఒకే పార్టీలో ఉన్నప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న నేతలు.. ఇప్పుడు మాత్రం బద్ద శత్రువులుగా మారి విమర్శలు చేసుకుంటున్నారు. ఇక వరంగల్ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి.

ఈ లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ బరిలో దిగుతుండగా.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు గురుశిష్యులుగా ఉన్న ఆరూరి రమేష్, కడియం శ్రీహరిలు ఇప్పుడు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకోవడం సంచలనంగా మారింది.

Kadiyam Srihari

ఆరూరి రమేష్‌ ఒకప్పుడు తన దగ్గర సాధారణ కార్యకర్తగా ఉన్నాడని.. తానే అతడిని క్లాస్ వన్ కాంట్రాక్టర్‌గా తయారు చేశానని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. తనకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చావా అంటూ ఆరూరి రమేష్ ని నిలదీశారు కడియం శ్రీహరి. దమ్ముంటే ఇచ్చినట్టు నిరూపించాలంటూ సవాల్ కూడా విసిరారు. తన వల్లే రాజకీయాల్లో ఎదిగిన ఆరూరి రమేష్ తనకు వెన్నుపోటు పొడిచాడంటూ కడియం శ్రీహరి ఘాటు విమర్శలు చేశారు.

తన కుమార్తె కడియం కావ్య గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు శ్రీహరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’’నా కూతురు వరంగల్‌లోనే పుట్టి పెరిగింది. ఇక్కడే ఉద్యోగం చేసింది. తన క్లాస్‌మెట్‌ను లవ్ మ్యారేజ్ చేసుకుందది. నా కూతురు.. చదువుల్లో ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికెట్‌ కూడా ఉపయోగించుకుంది. మతం మారినంత మాత్రాన కులం మారదని 2017లో సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌లో భాగంగానే.. నా కూతురు పెళ్లి చేసుకుంది. తన పనితీరే తన పెట్టుబడి. అదే నా కుమార్తెని గెలిపిస్తుంది‘‘ అని చెప్పుకొచ్చారు.

అలానే మంద కృష్ణ మాదిగ కేవలం తన మీద మాత్రమే విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. తనకు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చినట్లు నిరూపిస్తే తన కూతురు పోటీ నుంచి తప్పుకుంటుందని కడియం శ్రీహరి ఛాలెంజ్ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి