iDreamPost

సైలెంట్ గా OTT‌లోకి వచ్చేసిన మెగాస్టార్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Kaathal – The Core OTT Release: ఇటీవల ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి. కరోనా సమయంలో చాలా మంది ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.. ఇప్పుడు అదే ట్రెండ్ కొనసాగుతుంది.

Kaathal – The Core OTT Release: ఇటీవల ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి. కరోనా సమయంలో చాలా మంది ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.. ఇప్పుడు అదే ట్రెండ్ కొనసాగుతుంది.

సైలెంట్ గా OTT‌లోకి వచ్చేసిన మెగాస్టార్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఒకప్పుడు సినిమా రిలీజ్ అంటే థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సందడి ఉండేది. పట్టణాల్లో తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే.. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఫస్ట్ షో చూసేందుకు తరలివచ్చేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. థియేటర్లో మిస్ అయిన సినిమాలు నెలల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. భారతీ భాషా చిత్రాలే కాదు.. ఇతర భాషా చిత్రాలు, వెబ్ సీరీస్ ఓటీటీలో సందడి చేస్తున్నాయి. కరోనా సమయంలో జనాలు థియేటర్లలో సినిమాలు చూసే అవకాశం లేకుండా పోయింది.. దీంతో ఓటీటీకే పరిమితం అయ్యారు. అదే ఇప్పుడు అలవాటుగా మారింది.. చాలా మంది ఓటీటీకీ జై కొడుతున్నారు. తాజాగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన సూపర్ హిట్ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్ లో మెగాస్టార్ మమ్ముట్టి ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఎలాంటి పాత్రలైనా సరే ఆయన కోసమే క్రియేట్ చేశారా అన్న చందంగా ఉంటాయి. వెండితెరపై ఆయన సహజ నటనకు ఎవరైనా మంత్రముగ్దులవుతారు. ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు. ఆయన తనయుడు దుల్కన్ సల్మాన్ కూడా హీరోగా రాణిస్తున్నారు. మమ్ముట్టి మొదటి నుంచి విభిన్న కథాంశాలు సెలక్ట్ చేసుకుంటూ సినీ ప్రియులను అలరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే  ప్రయోగాత్మకంగా నటించిన మూవీ ‘కాదల్ : ది కోర్’ మూవీ నవంబర్ 23న రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి జియో బేబి దర్శకత్వం వహించారు. జ్యోతిక ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీలో మమ్ముట్టి స్వలింగ సంపర్కుడి (గే) పాత్రలో కనిపిస్తారు.

mammooty movie in ott

కాదల్ : ది కోర్ మూవీ రిలీజ్ కి ముందు ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. కొంతమంది మమ్ముట్టి ఫ్యాన్స్ కూడా వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ మూవీ హూమో-సెక్సువాలిటీని ప్రోత్సహించే విధంగా ఉందని ఖతార్, కువైట్ దేశాలు బ్యాన్ చేశాయి. మొత్తానికి అన్ని విమర్శలు దాటుకుంటూ నవంబర్ 23న ఈ చిత్రం థియేటర్లో సందడి చేసి ఘన విజయం అందుకుంది. తాజాగా ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. కాకపోతే ఇక్కడ ఓ ట్విస్ట్.. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ మూవీ చూడాలంటే అద్దె చెల్లించాల్సి ఉంటుంది.. ఓటీటీలోకి అద్దె ప్రాతిపదికన రిలీజ్ చేశారు. మరి ఉచితంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి