iDreamPost
android-app
ios-app

అతనికి విరాట్‌ కోహ్లీ వికెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు! ఎవరీ సిద్థార్ధ్‌?

  • Published Apr 03, 2024 | 12:42 PM Updated Updated Apr 03, 2024 | 12:42 PM

Justin Langer, Sidharth, Virat Kohli: విరాట్‌ కోహ్లీని అవుట్‌ చేయగలవా అని ఓ కుర్ర బౌలర్‌ను అడిగితే.. కాస్త భయపడతాడు. కానీ, ఈ కుర్రాడు మాత్రం చేస్తాను సార్‌ అని చాలా నమ్మకంగా చెప్పాడు. చెప్పడమే కాదు చేసి చూపించాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Justin Langer, Sidharth, Virat Kohli: విరాట్‌ కోహ్లీని అవుట్‌ చేయగలవా అని ఓ కుర్ర బౌలర్‌ను అడిగితే.. కాస్త భయపడతాడు. కానీ, ఈ కుర్రాడు మాత్రం చేస్తాను సార్‌ అని చాలా నమ్మకంగా చెప్పాడు. చెప్పడమే కాదు చేసి చూపించాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 03, 2024 | 12:42 PMUpdated Apr 03, 2024 | 12:42 PM
అతనికి విరాట్‌ కోహ్లీ వికెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు! ఎవరీ సిద్థార్ధ్‌?

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మూడో ఓటమిని మూటగట్టకుంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం హోంగ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు జరిగిన ఓ సంఘటన మ్యాచ్‌ తర్వాత వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. లక్నో యువ స్పిన్నర్‌ మణిమారన్‌ సిద్ధార్థ్‌.. లక్నో కోచ్‌ జస్టిన్‌ లంగర్‌కు ఓ మాట ఇచ్చాడు. నిజానికి లంగర్‌ కోరిన కోరికను ఈ సిద్ధార్థ్‌ అనే కుర్రాడు తీర్చాడు. ఇంతకీ.. లంగర్‌ ఏం కోరాడో తెలుసా? విరాట్‌ కోహ్లీ వికెట్‌. మాకు కోహ్లీ వికెట్‌ కావాలి, నువ్వు అందించగలవా? అని లంగర్‌.. సిద్ధార్థ్‌ని కోరాడు. దానికి ఓకే చెప్పడం కాదు.. ఇచ్చిన మాట ప్రకారం, డేంజరస్‌గా మారుతున్న విరాట్‌ కోహ్లీని అవుట్‌ చేసి.. లక్నోకు మ్యాచ్‌ని, లంగర్‌కు కోహ్లీ వికెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు సిద్ధార్థ్‌.

ఈ మ్యాచ్‌లో 182 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగింది ఆర్సీబీ. ఎప్పటిలాగే కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌తో కలిసి విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌కి దిగాడు. కానీ, లక్నో మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఒక యువ స్పిన్నర్‌తో బౌలింగ్‌ ప్రారంభించింది. కోహ్లీకి ఎదురుగా స్పిన్నర్‌ సిద్ధార్థ్‌ బౌలింగ్‌ వేయడానికి వచ్చాడు. తొలి ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తన రెండో ఓవర్‌లో డుప్టెసిస్‌ రెండు ఫోర్లు బాదడంతో 12 రన్స్‌ ఇచ్చాడు. అయినా కూడా సిద్ధార్థ్‌పై నమ్మకంతో ఐదో ఓవర్‌ కూడా తనతోనే వేయించారు. అప్పుడు ఫలితం దక్కింది. తొలి బంతికే సూపర్‌ షాట్‌తో కోహ్లీ ఫొటో కొట్టి టచ్‌లోకి వచ్చాడు. అంతకు ముందు ఓవర్‌లో నవీన్‌ ఉల్‌ హక్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ కొట్టి.. గేర్‌ మార్చినట్లు కనిపించాడు.

అదే క్రమంలో సిద్ధార్థ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌ రెండో బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన కోహ్లీ.. బాల్‌ను మిస్‌ టైమ్‌ చేసి.. బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో పడిక్కల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. తన తొలి ఐపీఎల్‌ వికెట్‌గా విరాట్‌ కోహ్లీని అవుట్‌ చేయడంతో సిద్ధార్థ్‌ బాగా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. పైగా.. కోచ్‌ లంగర్‌కు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవడంతో అతని సంతోషానికి అవధులు లేవు. మణిమారన్‌ సిద్ధార్థ్‌ తమిళనాడుకు చెందిన ఆటగాడు. 1998 జూలై 3న జన్మించాడు. దేశవాళి క్రికెట్‌లో అద్భుతంగా రాణించడంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అతన్ని టీమ్‌లోకి తీసుకుంది. అతనిపై నమ్మకం ఉంచి.. బాగా ట్రైన్‌ చేసి.. ఏకంగా కోహ్లీ మీదకే వదిలారు. సిద్ధార్థ్‌ కూడా తనకు ఇచ్చిన టాస్క్‌లో సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. మరి సిద్ధార్థ్‌ కోహ్లీ వికెట్‌ తీయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.