iDreamPost

OTTని దున్నేస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మీరు చూశారా?

  • Published Feb 07, 2024 | 5:19 PMUpdated Mar 14, 2024 | 4:50 PM

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో భాషతో సంబంధం లేకుండా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు, సిరీస్ లు విడుదుల అవుతూ ఉన్నాయి. అయితే, వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మిస్ చేసి ఉంటే మాత్రం .. ఖచ్చితంగా వారు ఆ సస్పెన్స్ థ్రిల్లర్ ను చూడాల్సిందే.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో భాషతో సంబంధం లేకుండా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు, సిరీస్ లు విడుదుల అవుతూ ఉన్నాయి. అయితే, వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మిస్ చేసి ఉంటే మాత్రం .. ఖచ్చితంగా వారు ఆ సస్పెన్స్ థ్రిల్లర్ ను చూడాల్సిందే.

  • Published Feb 07, 2024 | 5:19 PMUpdated Mar 14, 2024 | 4:50 PM
OTTని దున్నేస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మీరు చూశారా?

ఎంటర్టైన్మెంట్ లో ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ దే పై చేయి. ఈ క్రమంలో ప్రతి వారం పదుల సంఖ్యలో.. భాషతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతూ ఉంటాయి. వాటిలో ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ , కామెడీ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లెర్స్ , క్రైమ్ స్టోరీస్ ఇలా అన్ని రకాల కంటెంట్ తో .. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఈ సినిమాలు, సిరీస్ లు విడుదల అవుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా చాలా మంది ఆడియన్స్ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లెర్స్ కు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. దాదాపు క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే ఆడియన్సు ఓటీటీలోకి వచ్చిన ప్రతి సినిమాను చూస్తూనే ఉంటారు. కానీ, ఒక వేళ ఎవరైనా సరే.. ఆహా ప్లాట్ ఫార్మ్ లో .. క్షణ క్షణం ఉత్కంఠభరితంగా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లయితే ..వెంటనే చూడాల్సిందే. అదే “మిడ్ నైట్ మర్డర్స్”. అసలు ఈ చిత్రాన్ని ఎందుకు మిస్ కాకూడదు! ఈ సినిమా కథ ఎలా ఉంటుంది ! అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రతి భాషలోనూ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ప్రతి సినిమా .. హిట్ అవుతూనే వస్తుంది. ఈ క్రమంలోనే 2020 లో .. మలయాళంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ” అంజామ్ పథిరా”. ఆ సమయంలో థియేటర్ లో విడుదలైన ఈ చిత్రం . బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆ చిత్రం “మిడ్ నైట్ మర్డర్స్” పేరుతో.. ఓటీటీలో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే , ఈ సినిమా కథ  విషయానికొస్తే..

డాక్టర్ అన్వర్ హుస్సేన్ (కుంచకో బొబన్) ఓ సైకాలజిస్ట్. అంతేకాకుండా .. అనధికారంగా క్రిమినాలజిస్ట్ పని చేస్తూ .. పోలీసులకు సలహాలు ఇస్తూ ఉంటాడు. అలాగే , మానసిక సమస్యలతో బాధపడుతున్న ఖైధీలను కలిసి వారితో మాట్లాడి, వాళ్ళు ఎందుకు హత్యలు చేశారు? అందుకు ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటి? ఆ సమయంలో వారి మానసిక పరిస్థితి ఎలా ఉండేది? అని రీసెర్చ్ చేస్తూ.. పోలీసులకు కూడా కొన్ని కేసుల్లో సహాయపడుతుంటాడు. పోలీస్ డిపార్ట్ మెంట్లో కన్సల్ టెంట్ క్రిమినాలజిస్ట్ గా జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో.. వరుసగా పోలీస్ ఆఫీసర్స్ హత్యకు గురవ్వడం మొదలవుతుంది. ఆ పోలీస్ ఆఫీసర్స్ కళ్ళు, గుండెను తొలగించి ఖాళీ ప్రదేశాలలో పడేస్తారు. అన్నీ అర్ధరాత్రి హత్యలే. ఎవరు చేస్తున్నారు? ఎందుకని పోలీసులనే టార్గెట్ చేశారు? అనేది ఎవరికీ అర్ధం కాదు. అదే సమయంలో అన్వర్ తన సైకాలజీ బ్రెయిన్ తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది. అసలు ఆ హత్యలను ఎవరు చేశారు అనేది.. తెలియాలంటే ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ను చూడాల్సిందే మరి.

ఇక రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు.. “మిడ్ నైట్ మర్డర్స్” ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ , క్రిమినల్ సైకోలజీ గురించి చాలా స్పష్టంగా ఈ సినిమాలో చూపించారు. ఒక క్రైమ్ థ్రిల్లర్ కు ఏం కావాలో .. ఎలా దానిని చిత్రీకరించాలో ఆ విధంగా ప్రతి పాత్రను తీర్చి దిద్దాడు దర్శకుడు. ఇక స్క్రీన్ ప్లే విషయానికొస్తే .. ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. కాగా, తెలుగు భాషలో కూడా ఈ చిత్రం ఆహ ప్లాట్ ఫార్మ్ లో ఉచితంగా అందుబాటులో ఉంది. అంతేకాకుండా అమెజాన్ లో కూడా రూ. 79 కు ప్రేక్షకులకు అందుబాటులో ఉంది ఈ చిత్రం. క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికీ “మిడ్ నైట్ మర్డర్స్” మంచి కంటెంట్ తో ఎంటర్టైన్ చేస్తుందని చెప్పి తీరాలి. కాబట్టి, ఇప్పటివరకు ఈ క్రైమ్ థ్రిల్లర్ ను మిస్ అయిన వారు.. వెంటనే చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి