iDreamPost

అన్న ‘రామరాజు’కి తమ్ముడు ‘భీం’ కానుక

అన్న ‘రామరాజు’కి తమ్ముడు ‘భీం’ కానుక

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎప్పటికీ మర్చిపోలేని వీడియో కానుకను ఇస్తానని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాటను కొన్ని గంటలు ఆలస్యంగా నెరవేర్చాడు. ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తామని నిన్న ఊరించిన టీం మళ్ళి మాట మార్చిన సంగతి తెలిసిందే. దీని గురించి చరణ్ తారక్ రాజమౌళి ఒకరిమీద ఒకరు సరదాగా సెటైర్లు వేసుకోవడం సోషల్ మీడియా ఫాలోయర్స్ కి మంచి వినోదాన్ని అందించింది. మధ్యలో చిరంజీవి కూడా ఇన్వాల్వ్ కావడంతో ఇది ఇంకాస్త జోష్ ఇచ్చింది.

ఏదైతేనేం ఆఖరికి 4 గంటలకు ఊరిస్తూ వచ్చిన వీడియో విడుదల చేశారు. ఇక దీని విషయానికి వస్తే ఊహించిన దాని కన్నా స్వీట్ షాక్ ఇచ్చారు. ఏదో మేకింగ్ వీడియోతోనో లేదా ఇద్దరి మధ్య రియల్ లైఫ్ లో ఫ్రెండ్ షిప్ మూమెంట్స్ తోనో నింపుతారు అనుకుంటే ఏకంగా చరణ్ పాత్ర పరిచయాన్ని చాలా గొప్పగా ఇందులో ప్రెజెంట్ చేశారు. వీడియో మొత్తం జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో ఉంది. గంభీరమైన తారక్ గొంతును చాలా రోజుల తర్వాత వినడం చాలా బాగుంది. ఇదే ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు.

” వాడు కనపడితే నిప్పుకణం నిలబడినట్టు ఉంటది, కలబడితే యేగుసుక్క ఎగబడినట్టు ఉంటది, ఎదురుబడితే సావుకైనా చెమట ధారకడతది. ప్రాణమైనా, బందూకైనా వాడికి బాంచన్ అయితది, ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి, నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు” అంటూ రోమాలు నిక్కబోడుచుకునే రేంజ్ లో చెప్పిన తారక్ మాటలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

వీడియోలో రామ్ చరణ్ జంధ్యం వేసుకుని చొక్కా లేకుండా పోలీస్ ప్యాంట్, బెల్టు లో కండలు తిరిగిన దేహంతో, మేడలో ఓం అంటూ మెరిసిపోయే మాలతో ఫాన్స్ కి కిరాక్ అనిపించే లుక్ లో సూపర్ అనిపించేశాడు. ప్రేక్షకులు ఏదైతే ఆశించారో అంత కన్నా ఎక్కువే ఈ వీడియోలో రూపంలో ఇచ్చింది ఆర్ఆర్ఆర్ టీం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం ఓ రేంజ్ లో ఉన్నాయి. మొత్తానికి కరోనా దెబ్బకు డల్ గా ఉన్న సోషల్ మీడియాకు ఇప్పుడీ వీడియో కొత్త ఊపు తెచ్చిందన్న మాట వాస్తవం.

Watch Video Here @ https://bit.ly/2WKyfQW

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి