iDreamPost

వీడియో: భార్యతో కలిసి స్టేజ్‌పై రాజమౌళి డ్యాన్స్! హీరో రేంజ్‌లో అదరకొట్టాడు!

తెలుగు ఇండస్ట్రీ పేరును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జక్కన్న ఇప్పుడు ప్రేమికుడిగా మారి..

తెలుగు ఇండస్ట్రీ పేరును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జక్కన్న ఇప్పుడు ప్రేమికుడిగా మారి..

వీడియో: భార్యతో కలిసి స్టేజ్‌పై రాజమౌళి డ్యాన్స్! హీరో రేంజ్‌లో అదరకొట్టాడు!

దర్శక ధీరుడు జక్కన్న అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ డైరెక్టర్‌గా మారిపోయాడు. హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ కూడా రాజమౌళి దర్శకత్వ లక్షణాలకు ఫిదా అయిపోయిన సంగతి విదితమే. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అండ్ ఆస్కార్ అవార్డులు వరించిన సంగతి విదితమే. ఆర్ఆర్ఆర్ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. జపాన్ దేశంలో ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఇటీవల జక్కన్న జపాన్ వెళ్లి వచ్చిన సంగతి విదితమే. ఆ సమయంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే పిక్చర్ గురించి అప్టేట్ ఇచ్చారు. ఇది ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ ద్వితీయార్థంలో సినిమా స్టార్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా, పని రాక్షసుడిగా పేరుపడ్డ దర్శకుడు.. ప్రతి సన్నివేశం అద్భుతమైన దృశ్య కావ్యంగా ప్రేక్షకులకు అందించేందుకు తాను కష్టపడుతూనే, హీరోలను సైతం కష్టపెడతాడు. ఈ విషయాన్ని ఆయనతో పని చేసిన స్టార్ హీరోలు చెప్పిన మాటే. అలాగే ఎలా నటించాలో కూడా చూపిస్తాడని పేరుంది. ఇప్పుడు అతడో మరో టాలెంట్ బయటకు వచ్చింది. రాజమౌళి డ్యాన్సులు వేసి అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. భార్య రమాతో కలిసి స్టేజీపై హుషారుగా స్టెప్పులేశాడు ఈ దర్శకుడు. ప్రేమికుడు మూవీలోని ‘అందమైన ప్రేమరాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైనా కవితలౌనులే’ పాటకు ఇద్దరు కలిసి కాలు కదిపారు. హీరో లెవల్లో డ్యాన్స్ ఇరగదీశాడు మన దర్శకుడు. ఇందులో రాజమౌళికి తగ్గట్లుగా రమా స్టెప్పులేయడం విశేషం. ఈ డ్యాన్సు చూస్తుంటే ఫిదా కానీ వారుండరు.

ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి.. ప్రస్తుతం తన సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తున్నాడు. వారితో కలిసి వెకెషన్లకు వెళుతున్నాడు. ఈ సంవత్సరం మలి సగం నుండి మహేష్ సినిమా (ఎస్ఎస్ఎంబీ 29) షురూ కానుంది. ఇప్పటికే కథ సిద్ధం కాగా, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా , గ్లోబల్ హీరోగా అవతరించబోతున్నాడు మహేష్ బాబు. ఈ మూవీ కోసమే సూపర్ స్టార్ మేకోవర్ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఈ పిక్చర్ కోసం పని చేసే టెక్నీషియన్లు కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్.. రాజమౌళి చిత్రం నుండి అనూహ్యంగా తప్పుకోగా పీఎస్ వినోద్ వచ్చి చేరారు. సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి, ఎడిటర్ గా తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్ మోహన్ నాథ్, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్‌గా కమల్ కన్నన్, రమా రాజమౌళిలు పనిచేయబోతున్నారని తెలుస్తోంది. ఇందులో అలియా భట్‌తో పాటు మరో విదేశీ భామ కూడా నటించబోతుందని టాక్ నడుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి