iDreamPost

GameChanger Movie: గేమ్ ఛేంజర్ స్టోరీ లైన్ అదేనా?

  • Published Mar 20, 2024 | 7:52 PMUpdated Mar 20, 2024 | 7:52 PM

ఆర్ ఆర్ ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తరువాత రామ్ చరణ్ దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.అలా ప్రతి సినిమా షూటింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకునే శంకర్ లెక్క అనుకోకుండా తప్పింది.

ఆర్ ఆర్ ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తరువాత రామ్ చరణ్ దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.అలా ప్రతి సినిమా షూటింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకునే శంకర్ లెక్క అనుకోకుండా తప్పింది.

  • Published Mar 20, 2024 | 7:52 PMUpdated Mar 20, 2024 | 7:52 PM
GameChanger Movie: గేమ్ ఛేంజర్ స్టోరీ లైన్ అదేనా?

ఆర్ ఆర్ ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తరువాత రామ్ చరణ్ దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తన కెరీర్ లోనే భారీ చిత్రంగా చిత్రంగా తెరకెక్కుతోంది. అంతే కాకుండా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చరణ్ – శంకర్ ఇద్దరి కెరీర్ లో కూడా ఇది 15వ సినిమా కావడమే. దీని వల్ల ఈ సినిమాకి చాలా ప్రత్యేకత వచ్చింది. షూటింగ్ లో కొంత ఆలస్యం జరిగినా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల, ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులని కొన్నట్లు ప్రకటించింది. అయితే ఇదే క్రమంలో అనుకోకుండా సినిమా స్టోరీ లైన్ బయట పడింది.

నిజానికి తన సినిమాలకు సంభందించి ఎలాంటి డిటైల్స్ లీక్ అవకుండా చూస్తారు శంకర్. అయన సినిమాల్లో కనిపించే నటీనటులు కూడా సినిమా కథ గురించి కానీ వేరే విషయాల గురించి కానీ మాట్లాడటానికి కూడా భయపడతారు. అలా ప్రతి సినిమా షూటింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకునే శంకర్ లెక్క అనుకోకుండా తప్పింది. ఎందుకంటే గేమ్ ఛేంజర్ స్టోరీ లైన్‌ అఫీషియల్‌గా విడుదలైంది.

పైన చెప్పుకున్న విధంగా స్ట్రీమింగ్ యాప్ ప్రైమ్ వీడియో నిన్న గేమ్ ఛేంజర్ ఓటీటీ అప్‌డేట్‌ను విడుదల చేసింది, ఆ అప్డేట్ లో బాగంగా చిన్న సమ్మరీ లాగా సినిమా స్టోరీ బయటకి వచ్చేసింది. ఎన్నికల నేపథ్యంలో అవినీతితో నిండిపోయిన ప్రభుత్వానికీ నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారికి మధ్య జరిగే పోరాటమే గేమ్ ఛేంజర్ సినిమా ప్రధాన కథ. ఇన్నేళ్లుగా చిత్ర బృందం ఏ విషయం లీక్ అవకుండా చూసుకున్నా ఎట్టకేలకు సినిమా కథ ఇదీ అని తెలిసిపోయింది. అయితే ఇది కేవలం మూల కథ మాత్రమే అని,
సినిమాలో ఆసక్తికరమైన మలుపులు ఇంకా చాలా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలలో గట్టి టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలన్నీ నిజమైతే గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయి తీరుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి