iDreamPost

Jr NTR : అభిమానుల అసంతృప్తికి తారక్ బదులు

Jr NTR : అభిమానుల అసంతృప్తికి తారక్ బదులు

ఆర్ఆర్ఆర్ అప్పుడే రికార్డుల ఊచకోత మొదలుపెట్టింది. టాక్ యునానిమస్ గా బాహుబలి రేంజ్ లో లేకపోయినప్పటికీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఒక్కసారైనా థియేటర్లలో చూడాలని టెంప్ట్ చేసేలా ఉండటంతో ప్రేక్షకులు టికెట్ల కోసం పరుగులు పెడుతున్నారు. ధరల విషయంలో విపరీతమైన హైక్ ఇబ్బందిగానే కనిపిస్తున్నప్పటికీ ఈ గ్రాండియర్ కి అంత మొత్తాన్ని ఇవ్వొచ్చనే రీతిలో ఆడియన్స్ ముందే ప్రిపేర్ కావడంతో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని చోట్ల ఆల్ టైం రికార్డులు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ వీకెండ్ ఈ రోజు రేపూ ఇదే ప్రభంజనాన్ని కొనసాగించడం ఖాయం.

ఇక అభిమానుల సంగతి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ని ప్రెజెంట్ చేసిన తీరు పట్ల వాళ్ళు పూర్తి సంతృప్తిగా లేరని సోషల్ మీడియా ట్రెండ్ ని గమనిస్తే అర్థమవుతుంది. నిజానికి రాజమౌళి చాలా బాలన్స్డ్ గా ఇద్దరినీ చూపించాడు. అయితే క్లైమాక్స్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో చరణ్ మొత్తం స్క్రీన్ ని టేకోవర్ చేయడంతో తారక్ అక్కడ సైడ్ లైన్ అవ్వాల్సి వచ్చింది. ఇంటర్వల్ అయ్యాక వచ్చే కొమరం భీముడొ పాట కనక పోతే ఈ క్యారెక్టర్ ఇంకా వీక్ అయ్యేది. ప్రత్యేకంగా రామరాజుకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టి అజయ్ దేవగన్ ని తండ్రిగా చూపించిన జక్కన్న కొమరం భీమ్ కు మాత్రం అలా ఎందుకు చేయలేదనే కామెంట్ బలంగా వినిపిస్తోంది.

నిడివి ఇప్పటికే మూడు గంటలకు పైగా ఉన్న నేపథ్యంలో పైన చెప్పింది ప్రాక్టికల్ గా సాధ్యం కాకపోవచ్చు కానీ ఆ రామ్ చిన్నప్పటి ఎపిసోడ్ తీసేసి ఈ ఇద్దరి కాంబినేషన్ ట్రాక్ మరింత పొడిగించి ఉంటే ఇంకా బాగుండేది. సెకండ్ హాఫ్ మైనస్సులో ఇదే ప్రధానంగా నిలిచింది. ఒకే స్థాయి స్టార్లు కలిసి నటించినప్పుడు ఇలాంటి అసంతృప్తులు చెలరేగడం సహజం. వారసుడు, మహాసంగ్రామం, బలరామకృష్ణులు, అశ్వమేథం లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆయా దర్శకులు హీరోలు ఈ సమస్యను ఎదురుకున్నవారే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కీ తప్పలేదు. కాకపోతే తారక్ తన టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ తో అధిక శాతం అభిమానులను మెప్పించాడు.

Also Read : RRR Movie Review : ఆర్ఆర్ఆర్ రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి