Venkateswarlu
Venkateswarlu
ఏపీలో స్కిల్ స్కామ్ బయటకి రావడంతో చంద్రబాబు అవినీతిపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇన్నాళ్ల సుదీర్ఘ కాలంలో స్టేల ద్వారా న్యాయవ్యవస్థలకి దొరక్కుండా తప్పించుకున్న బాబు.. ఇప్పుడు రిమాండ్ ఖైదీగా జైలు ఊసలు లెక్కపెడుతున్నారు. ఇలాంటి సమయంలో “నిన్ను నమ్మలేం బాబు” అంటూ “రేణుక పోతినేని” అనే ఓ సీనియర్ జర్నలిస్ట్ చేసిన పరిశోధన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2014లో ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై పూర్తి పరిశోధన చేసిన ఆమె విస్తుపోయే నిజాలను తెలుకున్నాను అంటూ “రేణుక పోతినేని” తన రిపోర్ట్ బయటపెట్టింది. అందులో ఉన్న పూర్తి విషయాలను ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం.
1) అసలు స్కిల్ స్కాం అంటే ఏమిటి? ఎలా జరిగింది? ఆ స్కాం ద్వారా చంద్రబాబు ఎంత దోచుకున్నారన్న వివరాలను రేణుక వెల్లడించారు.
2) చంద్రబాబు స్కిల్ స్కాం ద్వారా ప్రజల డబ్బును ఎలా దారి మళ్లించారో ఆమె చెప్పుకొచ్చారు.
3) ఈ స్కాంకు సంబంధించి టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణలను.. స్కిల్ స్కాం అసలు నిజానిజాలను ఆమె వివరించారు.
4) కేవలం స్కిల్ స్కాం ద్వారానే కాదు.. పోలవరం ప్రాజెక్టులో కూడా బాబు అవినీతికి పాల్పడ్డారని, 25 వేల కోట్ల రూపాయలు దోచేశారని ఆమె పేర్కొన్నారు.
5) గోదావరి- పెన్నా నదుల అనుసంధానం పేరిట 3 వేల కోట్లు.. ప్రభుత్వ పనుల్ని కోటరీలోని కాంట్రాక్టర్లకు కట్టబెట్టి 2 వేల కోట్లు దోచుకున్నారని ఆమె తెలిపారు.
6) పోలవరం మట్టికట్టలో కూడా బాబు అవినీతి పాల్పడ్డారని, ఏకంగా 1590 కోట్ల రూపాయలు దోచేశారని వెల్లడించారు.
7) చింతల పూడి ఎత్తిపోతల పథకంలో అవినీతి ద్వారా బాబు 573 కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆమె అన్నారు.
8) చంద్రబాబు ఉరవకొండ సామాజిక ఎత్తిపోతల సూక్ష్మ నీటి పారుదల పథకం కింద 400 కోట్ల రూపాయలు కొట్టేశారని ఆమె తెలిపారు.
9) టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు విశాఖలో యథేచ్ఛగా వేల ఎకరాలు కబ్జా చేశారని ఆమె వెల్లడించారు.
10) బాబు పాలనలో టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల ఈనాం భూముల్ని కబ్జా చేశారని, అమరావతిలో కోట్లు విలువ చేసే భూమిని తన మనుషులకు తక్కువ ధరకే కట్టబెట్టారని ఆమె పేర్కొన్నారు.
11) చంద్రబాబు క్విడ్ ప్రోకో ద్వారా రూ. లక్ష కోట్ల రూపాయలు దోపీడీ చేశారని ఆమె వెల్లడించారు.
12) నీరు-చెట్టు పథకం ద్వారా నాలుగేండ్లలో 34, 399 కోట్ల రూపాయలు దోచేశారని ఆమె తెలిపారు.
13) చంద్రబాబు విద్యుత్ శాఖలోనూ అవినీతికి పాల్పడ్డారని, 21 వేల కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆమె పేర్కొన్నారు.
14) చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సొంత సోకులకు కూడా వేల కోట్ల ప్రభుత్వం సొమ్మును ఖర్చు చేశారని వెల్లడించారు.
15) ప్రజల ప్రాణాలను కాపాడే ఆరోగ్య శాఖలోనూ బాబు అవినీతికి పాల్పడ్డారని, 3 వేల కోట్లకు పైగా మింగేశాడని ఆమె తెలిపారు.
16) తాత్కాలిక సచివాలయం కోసం 120 కోట్లు ఖర్చు అయ్యే చోట 1151 ఖర్చు చేసి.. అందులో 1,031 కోట్లు ఎలా స్వాహా చేశారో ఆమె వివరించారు.
17) బాబు స్విస్ ఛాలెంజ్ ద్వారా 66 వేల కోట్ల రూపాయలు ఎలా దోచుకున్నారో ఆమె వెల్లడించారు.
18) సొంత సంస్థ హెరిటేజ్ కోసం అమరావతిలో తక్కువ ధరకే 14 ఎకరాలు ఎలా కొన్నారో ఆమె వివరించారు.
19) దగ్గరి బంధువు అవ్వాస్ వెంకటరామారావు ద్వారా చంద్రబాబు అగ్రిగోల్డ్‌లో 35 వేల కోట్ల స్కామ్ ఎలా చేశారో ఆమె తెలిపారు.
20) చంద్రబాబు తన బినామీల ద్వారా రాజధానిలో ఏ విధంగా దందాలకు పాల్పడ్డారో వివరించారు.
21) చంద్రబాబు నిబంధనలకు పాతర వేసి.. పవన విద్యుత్‌లో 11, 625 కోట్లు దోచుకున్నారని తెలిపారు.
22 ) మెడికల్ పార్కు, ఫైబర్ గ్రిడ్, చలివేంద్రాల ద్వారా వేల కోట్ల కుంభకోణం చేశారని ఆమె అన్నారు.
23 ) బాబు హెరిటేజ్ కోసం 12,00 కోట్లు దోచి పెట్టారని, ఆఖరికి చంద్రన్న కానుకలో కూడా అవినీతికి తెర తీశారని అన్నారు.
24 ) కృష్ణా పుష్కరాల్లో కూడా బాబు అవినీతికి పాల్పడ్డారని, ఏకంగా 736 కోట్లు దోచేశారని ఆమె వెల్లడించారు.
25) ట్రాన్స్‌కోలో 675 కోట్లు, జెన్‌కోలో 670 కోట్లు దోచేశారని ఆమె పేర్కొన్నారు.
26) రాష్ట్రంలో సీసీ కెమెరాలు బిగించే పనిలోనూ బాబు 270 కోట్లు దోచేశారని, కియా కంపెనీ భూమి చదును చేయటంలో 153 కోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పారు.
27) జన్మభూమి కమిటీల ద్వారా బాబు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆమె వెల్లడించారు.
28) ఇసుక, కంకర, విదేశీ బొగ్గు, తెల్లరాయి మైనింగ్ ఇలా అన్నిట్లో అవనీతి చేశారన్నారు.
29) నీటి ప్రాజెక్టుల ద్వారా బాబు వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని లెక్కలతో సహా ఆమె వివరించారు.