iDreamPost

తాలిబన్ల దెబ్బకు సమోసాలు అమ్ముతున్న జర్నలిస్టు 

తాలిబన్ల దెబ్బకు సమోసాలు అమ్ముతున్న జర్నలిస్టు 

అఫ్గానిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం వచ్చిన నాటి నుంచి ఆ దేశ ప్రజల జీవితాలు చాలా దారుణంగా మారాయి. అనేక మంది తమ వృత్తులను కోల్పోవాల్సి వచ్చింది. ఎన్నో కుటుంబాలు సరైన ఉపాధి లేక రోడ్డున పడ్డాయి. ఇప్పుడు అలాంటి ఒక జర్నలిస్ట్ కథే, ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

మూసా మొహమ్మది అనే జర్నలిస్టు ప్రస్తుతం అఫ్గాన్ వీధుల్లో తినుబండారాలు అమ్ముకుంటున్నాడు. తాలిబన్ల పాలనకు ముందు ప్రముఖ న్యూస్ యాంకర్ గా ఉన్నాడు ముసా. పలు అప్గాన్ ఛానెళ్ళలో జర్నలిస్టుగా సేవలందించాడు. కానీ, తాలిబన్లో పరిస్థితులు మారిపోయాక ఇప్పుడు రోడ్డున పడాల్సి వచ్చింది.

పేదరికంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు చివరకు సమోసాలు అమ్ముకుంటున్నాడు. ఈ విషయం నేషనల్ రేడియో, టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ కు తెలియడంతో తన విభాగంలోనే ముసాను తీసుకుంటానని ముసాకు హామి ఇచ్చారు.

తాలిబన్ పాలన మొదలుపెట్టిన తరువాత అక్కడ పేదరికం మరింతగా పెరిగపోయింది. అఫ్గాన్ ను ఆర్థిక సంక్షోభం ఆవరించింది. పిల్లల్ని, వాళ్ళ సొంత అవయావాలని అమ్ముకోవాల్సినంత దారుణంగా మారింది అఫ్గాన్. గతంలో స్త్రీలు స్వేచ్ఛగా ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహించిన అఫ్గాన్లో నేడు వంటింటికే పరిమితం కావాల్సి వస్తోంది. ఇలా అన్ని వర్గాల ప్రజలు తాలిబన్ల రాక్షస పాలనకు నరకం చూస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి