iDreamPost

AFG vs SL: వీడియో: ఇలాంటి కీపింగ్ ఎప్పుడూ చూసి ఉండరు.. గిల్​క్రిస్ట్​కు మించిన రేంజ్​లో..!

  • Published Feb 04, 2024 | 1:53 PMUpdated Feb 04, 2024 | 1:53 PM

కీపింగ్ అంటే అందరికీ వెంటనే గుర్తుకొచ్చే పేరు ఆడమ్ గిల్​క్రిస్ట్. వికెట్ల వెనుక అద్భుతంగా బంతుల్ని పట్టుకునే గిల్లీ.. సూపర్బ్ కీపింగ్​తో ఎన్నో మ్యాచుల్లో ఒంటిచేత్తో టీమ్​ను గెలిపించాడు. అలాంటోడ్ని మించిన రేంజ్​లో ఓ క్రికెటర్ కీపింగ్ చేశాడు.

కీపింగ్ అంటే అందరికీ వెంటనే గుర్తుకొచ్చే పేరు ఆడమ్ గిల్​క్రిస్ట్. వికెట్ల వెనుక అద్భుతంగా బంతుల్ని పట్టుకునే గిల్లీ.. సూపర్బ్ కీపింగ్​తో ఎన్నో మ్యాచుల్లో ఒంటిచేత్తో టీమ్​ను గెలిపించాడు. అలాంటోడ్ని మించిన రేంజ్​లో ఓ క్రికెటర్ కీపింగ్ చేశాడు.

  • Published Feb 04, 2024 | 1:53 PMUpdated Feb 04, 2024 | 1:53 PM
AFG vs SL: వీడియో: ఇలాంటి కీపింగ్ ఎప్పుడూ చూసి ఉండరు.. గిల్​క్రిస్ట్​కు మించిన రేంజ్​లో..!

క్రికెట్​లో బ్యాటింగ్, బౌలింగ్ ఎంత ముఖ్యమో ఫీల్డింగ్​ కూడా అంతే ముఖ్యం. ఫీల్డింగ్​లో మిగిలిన పొజిషన్స్ కంటే కీపింగ్​కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. వికెట్ల వెనుక నిలబడే ప్లేయర్ స్టంపింగ్స్, రనౌట్స్​లో కీలక పాత్ర పోషిస్తాడు. అలాగే ఎల్బీడబ్ల్యూ లాంటి నిర్ణయాల్లో కెప్టెన్​కు ఎంతో సహాయం చేస్తాడు. అలాగే ఫీల్డ్ ప్లేస్​మెంట్స్​ సెట్ చేయడంలోనూ కీపర్ల పాత్ర చాలా కీలకం. కీపర్​కు గ్రౌండ్​ మొత్తం పర్ఫెక్ట్​గా కనిపిస్తుంది. ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి.. బ్యాటర్ల ఫుట్​వర్క్ ఎలా ఉంది, ఏ బౌలర్​ను తీసుకొస్తే బ్రేక్ త్రూస్ వచ్చే ఛాన్స్ ఉందనేది తెలుస్తుంది. అందుకే మహేంద్ర సింగ్ ధోని, కుమార సంగక్కర లాంటి పలువురు కీపర్లు కెప్టెన్లుగానూ ఎంతో సక్సెస్ అయ్యారు. అయితే కీపింగ్​లో తోపు ఎవరంటే మాత్రం ఠక్కున వినిపించే పేరు ఆడమ్ గిల్​క్రిస్ట్. అద్భుతమైన బ్యాటింగ్​తో పాటు సూపర్బ్ కీపింగ్ స్కిల్స్​తో ఆస్ట్రేలియాకు ఎన్నో మ్యాచుల్లో సింగిల్ హ్యాండ్​తో విజయాలు అందించాడతను. అయితే అలాంటి గిల్లీని మించే రేంజ్​లో ఓ లంక ప్లేయర్ కీపింగ్ చేశాడు.

శ్రీలంక, ఆఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్​లో సదీర సమరవిక్రమ అద్భుతం చేశాడు. వికెట్ల వెనుక ఎంతో చురుగ్గా ఉండే ఈ లంక కీపర్ దెబ్బకు ఆఫ్ఘాన్ బ్యాటర్ రెహ్మత్ షా (91)కు మైండ్ బ్లాంక్ అయింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన షా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. టపటపా వికెట్లు పడుతున్నా ఒక ఎండ్​లో అతడు పరుగులు చేస్తూ పోయాడు. దీంతో అతడి కోసం స్పెషల్ ప్లాన్ వేశాడు లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా. షా కోసం ప్రభాత్ జయసూర్యను రంగంలోకి దింపాడు. అతడు ఎలాగూ లెగ్ గల్లీ సైడ్ రన్​కు ప్రయత్నిస్తాడని ఊహించి అందుకు తగ్గట్లే లెగ్ వికెట్​ను టార్గెట్ చేస్తూ బాల్ వేయించాడు. అనుకున్నట్లే రెహ్మత్ అదే షాట్​ ఆడాడు. దీంతో వికెట్ల వెనుక కాచుకొని ఉన్న కీపర్ సమరవిక్రమ బ్యాటర్ షాట్ ఆడుతున్నప్పుడే లెగ్ గల్లీ సైడ్ వైపు పరిగెత్తాడు.

లెగ్ గల్లీ వైపు పరిగెత్తిన సమరవిక్రమ రెహ్మత్ బ్యాట్​ను తాకి బాల్ అలా వచ్చిందో లేదో చటుక్కున పట్టేశాడు. దీంతో ఆఫ్ఘాన్ బ్యాటర్ షాకయ్యాడు. షాట్ పూర్తి కాకముందే కీపర్ అటు వైపు ఎలా వెళ్లాడో అర్థం కాక తలపట్టుకున్నాడు. ఇది ట్రాప్ అని తర్వాత తెలుసుకున్నాడు. సమరవిక్రమ క్యాచ్​కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ లంక కీపర్​కు హ్యాట్సాఫ్ అని అంటున్నారు. ఇలాంటి కీపింగ్ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. గిల్​క్రిస్ట్ వికెట్ల వెనుక ఎన్నో అద్భుతాలు చేశాడని.. కానీ ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ పట్టి ఉండడని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సమరవిక్రమ కీపింగ్​ మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి