SNP
SNP
టీమిండియా మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇక ఇండియాలో అతనికున్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మోడ్రన్ క్రికెటర్లలో కోహ్లీకి ఫ్యాన్ బేస్ మిలియన్స్‌లో ఉంది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ కోహ్లీని ఇష్టపడేవాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే వారిలో అంతర్జాతీయ క్రికెటర్ల తల్లులు కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న విరాట్ కోహ్లీని ఓ క్రికెటర్ తల్లి కలిసి, కోహ్లీని కలవాలనే తన కలను నిజం చేసుకుంది.
వెస్టిండీస్ వికెట్ కీపర్ జోషువా డా సిల్వా తల్లికి విరాట్ కోహ్లీ అంటే పిచ్చి అభిమానం. వెస్టిండీస్-భారత్ మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ చూసేందుకు వచ్చిన ఆమె.. తన అభిమాన క్రికెటర్ కోహ్లీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా కోహ్లీని ఎంతో ఆప్యాయంగా హగ్ చేసుకుని, ఓ తల్లి కొడుక్కి ముద్దు పెట్టినట్లు కోహ్లీకి ముద్దు పెట్టారు. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె చూపించిన ప్రేమకు కోహ్లీ మురిసిపోయాడు. ఈ ఎమోషనల్ సీన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోహ్లీ అంటే యువకుల్లోనే కాదు.. సీనియర్ సిటిజన్స్లోనూ క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
అయితే.. తన తల్లి ఇక్కడికి వస్తున్నట్లు డాసిల్వా తొలి రోజు మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీకి చెప్పాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైక్‌లో రికార్డ్ అయింది. తన తల్లి తన ఆట చూసేందుకు ఇక్కడికి రావడం లేదని, కోహ్లీని చూసేందుకు వస్తున్నట్లు తనతో చెప్పినట్లు డాసిల్వా కోహ్లీతో చెప్పాడు. అప్పటికే కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. సెంచరీ సాధించాలని కోరుకుంటున్నట్లు కూడా డాసిల్వా కోహ్లీతో చెప్పాడు. మరి కోహ్లీపై డాసిల్వా తల్లి చూపించిన అభిమానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The moment Joshua Da Silva’s mother met Virat Kohli. She hugged and kissed Virat and got emotional. (Vimal Kumar YT).
– A beautiful moment! pic.twitter.com/Rn011L1ZXc
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 22, 2023
Joshua Da Silva’s mother hugged and kissed Virat Kohli. (Vimal Kumar YT).
This is so beautiful! pic.twitter.com/5N3bx301Jd
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 22, 2023
ఇదీ చదవండి: హాస్పిటల్ బెడ్స్ బుక్ చేసుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్! ఎందుకో తెలుసా?