iDreamPost
android-app
ios-app

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది నేను కాదు.. ‘జోష్’ మూవీ డైరెక్టర్ క్లారిటీ..

  • Author Soma Sekhar Published - 02:54 PM, Tue - 26 September 23
  • Author Soma Sekhar Published - 02:54 PM, Tue - 26 September 23
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది నేను కాదు.. ‘జోష్’ మూవీ డైరెక్టర్ క్లారిటీ..

డ్రగ్స్ కేసు టాలీవుడ్ ను ఇప్పట్లో వీడేలాలేదు. ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కేసు కలకలం సృష్టించింది. తాజాగా ఈ కేసులో ఒక డైరెక్టర్ ను, రచయితను అరెస్ట్ చేసిన సంగతి తెసిందే. ఇక ఈ కేసుకు సంబంధించి హీరో నవదీప్ ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇక్కడి వరకు బాగానేఉన్నా.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన డైరెక్టర్ పేరు వాసు వర్మ కావడంతో.. జోష్ మూవీ దర్శకుడు అని కొన్ని వెబ్ సైట్లు వార్తలు రాశాయి. కానీ ఆ వాసు వర్మ వేరు, ఈ వాసు వర్మ వేరు. దీంతో ఈ విషయంపై వివరణ ఇచ్చాడు జోష్ దర్శకుడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. తాజాగా ఈ కేసులో ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ వాసు వర్మ, రైటర్ మన్నేరి పృథ్వీకృష్ణను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో హీరో నవదీప్ ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే అరెస్ట్ అయిన వాసు వర్మ జోష్ సినిమా డైరెక్టర్ అని కొన్ని వెబ్ సైట్లు కథనాలు రాశాయి. ఆయన ఫొటోలు సైతం వాడాయి. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. విషయం కాస్త జోష్ డైరెక్టర్ వరకు వెళ్లింది. కాగా.. ఈ కేసులో అరెస్ట్ అయ్యింది నేను కాదని జోష్ మూవీ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు ఆయన వీడియో షేర్ చేశాడు.

ఆ వీడియోలో “నిన్నటి నుంచి ఒక వార్త వెబ్ సైట్ లో వ్యాప్తి చెందుతోంది. అది నా దృష్టికి వచ్చింది. అదీకాక ఈ విషయంపై నాకు ఫ్రెండ్స్, బంధువుల నుంచి ఫోన్లు కూడా వచ్చాయి. కానీ వాటిని నేను లైట్ తీసుకుని నవ్వుకున్నాను. పైగా నేను వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్నాను. అయితే ఈ వార్తలు ఎక్కువ కావడంతో స్పందించాల్సి వచ్చింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది నేను కాదు. నా పేరు కలిగిన వ్యక్తి కూడా ఇండస్ట్రీలో ఉన్నాడని తెలిసింది. దయచేసి ఈ తప్పుడు వార్త రాసిన వెబ్ సైట్లు త్వరగా పొరపాటును సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు జోష్ మూవీ డైరెక్టర్ వాసు వర్మ. అరెస్ట్ అయిన వాసు వర్మ ‘బస్తీ’ అనే మూవీకి దర్శకత్వం వహించాడు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabettarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet