iDreamPost
android-app
ios-app

ఇండియా అంటే వణికిపోతున్న బెయిర్‌ స్టో! హీరో టూ జీరో..

  • Published Feb 17, 2024 | 1:21 PM Updated Updated Feb 17, 2024 | 1:21 PM

జానీ బెయిర్‌ స్టో.. డేంజరస్‌ బ్యాటర్‌. క్రీజ్‌లో కుదురుకున్నాడంటే.. ఎదురుగా ఏ బౌలర్ ఉన్నా లెక్కచేయకుండా ఆడతాడు. కానీ, ఇండియాతో జరుగుతున్న సిరీస్‌లో మాత్రం పిల్లిలా మారిపోయాడు. ఈ క్రమంలోనే ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అందేంటో ఇప్పుడు చూద్దాం..

జానీ బెయిర్‌ స్టో.. డేంజరస్‌ బ్యాటర్‌. క్రీజ్‌లో కుదురుకున్నాడంటే.. ఎదురుగా ఏ బౌలర్ ఉన్నా లెక్కచేయకుండా ఆడతాడు. కానీ, ఇండియాతో జరుగుతున్న సిరీస్‌లో మాత్రం పిల్లిలా మారిపోయాడు. ఈ క్రమంలోనే ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అందేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 17, 2024 | 1:21 PMUpdated Feb 17, 2024 | 1:21 PM
ఇండియా అంటే వణికిపోతున్న బెయిర్‌ స్టో! హీరో టూ జీరో..

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆరంభంలో 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా కూడా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సెంచరీలతో టీమిండియాను ఆదుకున్నారు. అలాగే తొలి మ్యాచ్‌ ఆడుతున్న యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ సైతం హాఫ్‌ సెంచరీతో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో ధృవ్‌ జురెల్‌, అశ్విన్‌, బుమ్రా చిన్న చిన్న ఇన్నింగ్స్‌లతో టీమిండియాకు మంచి స్కోర్‌ అందించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్‌ రెండో రోజు భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ ఇండియన్‌ బౌలింగ్‌ ఎటాక్‌పై కౌంటర్‌ ఎటాక్‌కు దిగి.. వన్డే తరహా బ్యాటింగ్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 2 వికెట్ల మాత్రమే కోల్పోయి 207 పరుగులు చేసి పటిష్టస్థితిలో నిలిచింది.

మూడో రోజు మరింత దూకుడుగా ఆడుదాం అనుకున్న ఇంగ్లండ్‌కు టీమిండియా బౌలర్లు అడ్డుకట్ట వేశారు. 224 పరుగుల వద్ద జో రూట్‌ను అవుట్‌ చేసి బుమ్రా మంచి స్టార్‌ ఇచ్చాడు. ఆ వెంటనే తర్వాత ఓవర్‌లో అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన జానీ బెయిర్‌ స్టోను కుల్దీప్‌ యాదవ్‌ అద్భుతమైన డెలవరీతో అవుట్‌ చేశాడు. దీంతో.. బెయిర్‌ స్టో పరుగులేమీ చేయకుండా డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఈ డకౌట్‌తో బెయిర్‌ స్టో ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నిజానికి బెయిర్‌ స్టో చాలా డేంజరస్‌ బ్యాటర్‌. క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడా.. ఎలాంటి బౌలింగ్‌ ఎటాక్‌నైనా చీల్చిచెండాడగలడు. అలాంటి బ్యాటర్‌.. ఈ సిరీస్‌లో మాత్రం ఇప్పటి వరకు పెద్దగా రాణించలేదు. ఈ సిరీస్‌ అనే కాదు.. ఇండియాతో మ్యాచ్‌ అంటేనే బెయిర్‌ స్టో తేలిపోతూ ఉంటాడు. ఈ క్రమంలో ఏకంగా 8 డకౌట్లతో అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

India is a trembling Bairstow

ఇప్పటి వరకు టీమిండియాపై 37 టెస్ట్‌ ఇన్నింగ్స్‌లు ఆడిన బెయిర్‌ స్టో ఏకంగా 8 సార్లు డకౌట్‌ అయ్యాడు. టెస్టుల్లో ఇండియాపై ఎక్కువ సార్లు డకౌట్‌ అయిన క్రికెటర్‌గా బెయిర్‌ స్టో చెత్త రికార్డు క్రియేట్‌ చేశాడు. పాకిస్థాన్‌ మాజీ స్పిన్నర్‌ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా 7 సార్ల డకౌట్‌ రికార్డును బ్రేక్‌ చేస్తూ.. బెయిర్‌ స్టో 8 డకౌట్లతో తొలి స్థానంలో నిలిచాడు. కనేరియా 15 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ 7 డకౌట్లు, జెమ్స్‌ అండర్సన్‌ 6 డకౌట్లు ఉన్నారు. వీళ్లంతా బౌలర్లు.. డకౌట్‌ అయ్యారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ, అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడగా పేరు తెచ్చుకున్న బెయిర్‌ స్టో ఇలా ఇండియాపై డకౌట్లలో రికార్డు క్రియేట్‌ చేయడంతో అతనిపై సెటైర్ల వర్షం కురుస్తోంది. ఇండియా అంటే ఎందుకింత భయపడుతున్నావ్‌..? అంటూ బెయిర్‌ స్టోపై క్రికెట్‌ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.