iDreamPost

భారత్ చెత్త రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా రూట్ రికార్డు

ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్భుతమైన సెంచరీ చేశాడు. దీంతో భారత్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్భుతమైన సెంచరీ చేశాడు. దీంతో భారత్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

భారత్ చెత్త రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా రూట్ రికార్డు

ఇండియా-ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా సిరీస్ లో కీలకమైన నాలుగో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. ప్రారంభంలో పై చేయి సాధించినట్లు కనిపించిన టీమిండియా మ్యాచ్ ముగుస్తున్నకొద్ది పట్టు విడిచింది. డెబ్యూ పేసర్ ఆకాశ్ దీప్ అదరగొట్టాడు. ఇంగ్లండ్ టాప్ 3 బ్యాటర్లను పెవిలియన్ కు పంపి భారత్ కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. దాన్ని వినియోగించుకుని మిగతా బౌలర్లు కూడా రాణించారు. అయితే ఈ మ్యాచ్ ద్వారా భారత్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దానికి కారణం జో రూట్. అతడు సాధించిన అరుదైన ఫీట్ తో టీమిండియా చెత్త రికార్డును క్రియేట్ చేసింది.

జో రూట్.. టెస్ట్ క్రికెట్ కు అసలైన నిర్వచనంలా నిలుస్తూ వస్తున్నాడు. అయితే గత కొన్ని మ్యాచ్ ల నుంచి అనుకున్నంత రీతిలో ఆడలేకపోతున్నాడు. ఇండియాతో జరిగిన మూడు టెస్టుల్లో భారీ స్కోర్లు సాధించలేకపోయాడు. కానీ తాజాగా రాంచీ వేదికగా జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు.57 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును పటిష్టస్థితిలో నిలిపాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన రూట్ 226 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లతో 106 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే కెరీర్ లో 31వ సెంచరీని నమోదు చేసుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్.

ఇక ఈ శతకంతో చరిత్ర సృష్టించాడు జో రూట్. ఆ చరిత్ర కాస్త టీమిండియాకు ఓ చెత్త రికార్డును మూటగట్టేలా చేసింది. ఇండియాపై 10 టెస్ట్ సెంచరీలు చేసిన తొలి ప్లేయర్ గా జో రూట్ నిలిచాడు. ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా ఈ ఫార్మాట్ లో భారత్ పై 10 శతకాలు చేయలేదు. దీంతో ఈ అరుదైన ఘనత సాధించిన ఫస్ట్ ఆటగాడిగా రూట్ నిలిచాడు. ఇక ఈ రికార్డుతో పాటుగా పలు రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. రూట్ 106, రాబిన్ సన్ 31 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా బౌలర్లలో డెబ్యూ ప్లేయర్ ఆకాశ్ దీప్ 3 వికెట్లతో రాణించాడు. సిరాజ్ 2, జడేజా, అశ్విన్ తలా ఒక వికెట్ తీశారు.

ఇదికూడా చదవండి: కొడుకు.. కోట్లు సంపాదించే క్రికెటర్‌.. తండ్రి సెక్యూరిటీ గార్డ్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి