iDreamPost

అధికారులకు చెమటలు పట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడి కుక్క!

అధికారులకు చెమటలు పట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడి కుక్క!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పెంపుడు కుక్క వైట్‌ హౌస్‌లో అలజడి సృష్టిస్తోంది. ఆ కుక్క ధాటికి అధికారులు జడుసుకుని జ్వరం తెచ్చుకుంటున్నారు. ఆ కుక్క ఇప్పటి వరకు మొత్తం 11 మంది అధికారులపై దాడి చేసి గాయపరిచింది. ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జెర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నారు. రెండు సంవత్సరాల వయస్సున్న ఆ కుక్క పేరు కమాండర్‌. అది జో బైడెన్‌తో పాటే అధ్యక్ష నివాసంలో ఉంటోంది. మంగళవారం ఓ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ జో బైడెన్‌ నివాసానికి వెళ్లారు.

అక్కడ కమాండర్‌ దగ్గరగా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అది సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌పై దాడి చేసి కరిచింది. దీంతో డాక్టర్లు ఆయనకు చికిత్స చేశారు. ఈ సంఘటనపై అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ చీఫ్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆంథోనీ గుగ్లిమి మాట్లాడుతూ.. కమాండర్‌ దాడిలో గాయపడ్డ అధికారి ప్రస్తుతం బాగానే ఉన్నారని తెలిపారు. కాగా, కమాండర్‌ ఇప్పటి వరకు 11 మందిపై దాడి చేసింది. నవంబర్‌ 2022లో ఓ అధికారిపై దాడి చేసింది. అతడి చేతులు, తొడలపై తీవ్ర గాయాలు అయ్యాయి.

అంతేకాద! జో బైడెన్‌కు చెందిన మరో కుక్క ‘మేజర్‌’ కూడా వైట్‌ హౌస్‌లోని అధికారులపై దాడులకు పాల్పడుతోంది. ఇక, ఈ దాడులపై దేశ ప్రథమ మహిళ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుక్కలు దాడులు చేయకుండా ఆపలేకపోతున్నామని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే వైట్‌ హౌస్‌లో అధికారులు ప్రశాంతంగా పని చేయలేరని జనం భావిస్తున్నారు. మరి, సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లపై జో బైడెన్‌ పెంపుడు కుక్కలు దాడులు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి