iDreamPost

టెన్త్ అర్హతతో ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు.. జీతం రూ. 21,330

టెన్త్ అర్హతతో ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు.. జీతం రూ. 21,330

చదువుకుని మంచి ఉద్యోగం సాధించాలని యువత కలలు కంటుంటారు. దాని కోసం నిరంతరం శ్రమిస్తుంటారు. అలా ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్తను అందించింది ఎయిర్ పోర్ట్ సంస్థ. మీరు టెన్త్ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ నోటిఫికేషన్ మీకోసమే. పదో తరగతి అర్హతతో 998 ఎయిర్ పోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసిది. ముంబయి కేంద్రంగా ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఉద్యోగాలకు సంబంధించిన ప్ర‌క‌ట‌నను విడుద‌ల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హతలు ఏంటి? వయసు నిబంధనలు ఏంటీ? అనే విషయాలు మీ కోసం..

ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో హ్యాండీమాన్, యుటిలిటీ ఏజెంట్ పోస్టుల భ‌ర్తీకి ముంబయి కేంద్రంగా ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు యుటిలిటీ ఏజెంట్ పోస్టుల‌కు ఎస్‌ఎస్‌సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత క‌లిగి ఉండాలి. హ్యాండీమాన్ పోస్టుల‌కు ఎస్‌ఎస్‌సీ/ 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ లాంగ్వేజ్ వ‌చ్చి ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్పటికే మొదలవ్వగా.. సెప్టెంబ‌ర్ 18 వ‌ర‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

ముఖ్యమైన సమాచారం:

కంపెనీ: ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్

మొత్తం పోస్టులు : 998

పోస్టులు : హ్యాండీమాన్, యుటిలిటీ ఏజెంట్

అర్హతలు : యుటిలిటీ ఏజెంట్ పోస్టుల‌కు ఎస్‌ఎస్‌ఎసీ/ 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషతో పాటు హింధీపై కూడా పట్టు ఉండాలి. హ్యాండీమాన్ పోస్టుల‌కు ఎస్‌ఎస్‌ఎసీ/ 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ పై పట్టు ఉండాలి.

వయసు: జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, ఓబీసీ 31 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ 33 సంవత్సరాలు మించకూడదు

జీతం: నెలకు రూ.21330

ఎంపిక : శారీరక దారుఢ్య ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో

దరఖాస్తు ఫీజు : రూ.500

దరఖాస్తు పంపించాల్సిన చిరునామా : HRD డిపార్ట్‌మెంట్, AI ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, GSD కాంప్లెక్స్, సహార్ పోలీస్ స్టేషన్ దగ్గర, CSMI ఎయిర్‌పోర్ట్, టెర్మినల్-2, గేట్ నం. 5, సహర్, అంధేరి-ఈస్ట్, ముంబై-400099.

దరఖాస్తు చివరి తేది: సెప్టెంబ‌ర్ 18

వెబ్‌సైట్ : www.aiasl.in

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి