iDreamPost

టీమిండియాకు బిగ్‌ షాక్‌.. జట్టుకు బుమ్రా దూరం! కారణం ఏంటంటే?

  • Published Jun 22, 2024 | 1:29 PMUpdated Jun 22, 2024 | 1:29 PM

IND vs BAN, Jasprit Bumrah, T20 World Cup 2024: సూపర్‌ 8లో భాగంగా బంగ్లాదేశ్‌తో కీలకమైన మ్యాచ్‌కు బుమ్రా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతను ఎందుకు దూరం అవుతున్నాడో దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs BAN, Jasprit Bumrah, T20 World Cup 2024: సూపర్‌ 8లో భాగంగా బంగ్లాదేశ్‌తో కీలకమైన మ్యాచ్‌కు బుమ్రా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతను ఎందుకు దూరం అవుతున్నాడో దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 22, 2024 | 1:29 PMUpdated Jun 22, 2024 | 1:29 PM
టీమిండియాకు బిగ్‌ షాక్‌.. జట్టుకు బుమ్రా దూరం! కారణం ఏంటంటే?

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా టీమిండియా నేడు(శనివారం, జూన్‌ 22) సూపర్‌ 8లో తమ రెండో మ్యాచ్‌ ఆడనుంది. ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సిద్ధమైంది రోహిత్‌ సేన. మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ గెలిచి.. సెమీస్‌ రూట్‌ను క్లియర్‌ చేసుకోవాలని భావిస్తోంది భారత జట్టు. ఈ కీలక మ్యాచ్‌కి ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలేలా ఉంది. అదేంటంటే.. టీమిండియా స్టార్‌ బౌలర్‌ బుమ్రా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. బౌలింగ్‌లో టీమిండియా బలహీన పడటం ఖాయం.

ఈ వరల్డ్‌ కప్‌లో బుమ్రా ఎంత అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. అయితే.. సూపర్‌ 8 మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో జరుగుతున్నాయి. అక్కడి వేదికల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉండటంతో ఆటగాళ్లు ప్రయాణాలు చేసి అలసిపోతున్నారు. ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ కోసం ఆంటిగ్వా వెళ్లింది. అక్కడి నుంచి ఆస్ట్రేలియాతో సూపర్‌ 8 చివరి మ్యాచ్‌ కోసం సెయింట్‌ లూసియాకు వెళ్లాలి. సెమీస్‌ చేరితే.. మళ్లీ వేరే చోటుకి ప్రయాణం. ఇలా వరుస ప్రయాణాలతో ఆటగాళ్ల ఒళ్లు హూనం అయిపోతుంది.

కానీ, టీమిండియాకు ఒంటి చేత్తో విజయాలు అందిస్తున్న స్పీడ్‌స్టర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు ఈ అలసట నుంచి కాస్త ఉపశమనం ఇచ్చేందుకు ఇ‍చ్చేందుకు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అతనికి రెస్ట్‌ ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఎందుకంటే.. సెమీస్‌, ఫైనల్‌ లాంటి మ్యాచ్‌లకు బుమ్రా రెట్టించిన ఉత్సాహంతో అందుబాటులో ఉండాలంటే కాస్త రెస్ట్‌ అవసరం అని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచిస్తోంది. కీ ప్లేయర్‌ వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగే.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎలాంటి ప్లాన్స్‌తో బంగ్లాతో పోరాడుతాడో చూడాలి. ఎందుకంటే.. ఆంటిగ్వా పిచ్‌పై బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే అది స్లో పిచ్‌. సో బంగ్లా కూడా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది. మరి భవిష్యత్తు మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు రెస్ట్‌ ఇవ్వాలనే ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి