iDreamPost
android-app
ios-app

ముంబై నుంచి ఆర్సీబీలోకి జస్​ప్రీత్ బుమ్రా! కారణం అదేనా..?

  • Author singhj Updated - 02:57 PM, Wed - 29 November 23

ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్​కు ఆడుతున్న జస్​ప్రీత్ బుమ్రా ఫ్రాంచైజీ మారుతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్​కు ఆడుతున్న జస్​ప్రీత్ బుమ్రా ఫ్రాంచైజీ మారుతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

  • Author singhj Updated - 02:57 PM, Wed - 29 November 23
ముంబై నుంచి ఆర్సీబీలోకి జస్​ప్రీత్ బుమ్రా! కారణం అదేనా..?

టీమిండియా స్టార్ క్రికెటర్ జస్​ప్రీత్ బుమ్రా గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన వేగం, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్​తో అతడు వేసే బంతులకు బ్యాట్స్​మెన్ దగ్గర ఆన్సర్ ఉండదు. ఈ స్పీడ్​స్టర్ వేసే యార్కర్లు, బౌన్సర్లకు ఎంతటి బ్యాటర్​కైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తూ భారత జట్టులోని అన్ని ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్లలో ఒకడిగా మారాడు బుమ్రా. టీమిండియా బౌలింగ్ యూనిట్​ను చూసి అపోజిషన్ టీమ్స్ భయపడుతున్నాయంటే అందుకు బుమ్రా ప్రధాన కారణమని చెప్పాలి. అలాంటి బుమ్రా ఇటు ఇంటర్నేషనల్ లెవల్​తో పాటు అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్​ (ఐపీఎల్​)లోనూ దుమ్మురేపుతున్నాడు. మెగా లీగ్​లో ముంబై ఇండియన్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడీ పేసుగుర్రం. ఫెంటాస్టిక్ స్పెల్స్​తో ముంబైని ఎన్నో మ్యాచుల్లో సింగిల్ హ్యాండ్​తో గెలిపించాడు బుమ్రా.

బుమ్రా లేని ముంబై ఇండియన్స్ బౌలింగ్ అటాక్​ను ఊహించడమే కష్టంగా ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమయ్యేలా ఉంది. ముంబైని బుమ్రా వీడనున్నాడనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. 2013 నుంచి ముంబైకి ఆడుతున్న బుమ్రా.. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు మారుతున్నాడని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. బుమ్రా ముంబైని వీడటానికి హార్దిక్ పాండ్యానే కారణమని వినికిడి. గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్​కు ఆడుతూ వస్తున్న హార్దిక్​ను ట్రేడింగ్​లో భాగంగా ఈసారి ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఆ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్​ ఎండింగ్​లో ఉంది. కాబట్టి హార్దిక్​ను తదుపరి కెప్టెన్ చేస్తారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ముంబై ఇండియన్స్​ను ఇన్​స్టాగ్రామ్​లో బుమ్రా అన్​ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది.

రోహిత్ శర్మ తర్వాత తననే కెప్టెన్ చేస్తారని బుమ్రా అనుకున్నాడట. ముంబైకి 13 ఏళ్లుగా ఆడుతున్న ఈ స్పీడ్​స్టర్​కు.. ఈ మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా వద్దనుకున్నాడట. ముంబై మీద ఉన్న ప్రేమతో ఆఫర్లను కాదని ఫ్రాంచైజీపై విధేయతను చూపితే.. మళ్లీ పాండ్యాను తీసుకురావడం ఏంటని బుమ్రా సీరియస్​గా ఉన్నాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. హార్దిక్​ను తీసుకురావడం వల్ల కెప్టెన్సీ రేసులో తాను లేనని ఇన్​డైరెక్ట్​గా సిగ్నల్స్ ఇచ్చారని అతడు భావిస్తున్నాడట. అందుకే ఇన్​స్టాలో ముంబై ఇండియన్స్​ను అన్​ఫాలో చేశాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘కొన్నిసార్లు సైలెంట్​గా ఉండటమే బెస్ట్ ఆన్సర్’ అని ఇన్​స్టా స్టోరీలో బుమ్రా పెట్టిన స్టోరీ ఇప్పుడు వైరల్​గా మారింది. ముంబై యాజమాన్యాన్ని టార్గెట్ చేసుకునే అతడు ఈ పోస్ట్ పెట్టాడని అంటున్నారు. అతడితో ఆర్సీబీ మేనేజ్​మెంట్ చర్చలు జరిపిందని చెబుతున్నారు. ఈ డిస్కషన్స్​ ఓకే అయితే బుమ్రా ఆర్సీబీలోకి వెళ్లిపోవడం ఖాయమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి.. ఆర్సీబీలోకి బుమ్రా అంటూ వస్తున్న వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీ వల్ల కానిది.. రుతురాజ్ సాధించాడు! సాహో రుతు..

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet