iDreamPost

IPL చరిత్రలో రోహిత్ అరుదైన ఘనత.. ధోనీ తర్వాత ఒకే ఒక్కడిగా..!

MI vs PBKS- Rohti Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన ప్లేయర్ రోహిత్ శర్మ కావడం విశేషం.

MI vs PBKS- Rohti Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన ప్లేయర్ రోహిత్ శర్మ కావడం విశేషం.

IPL చరిత్రలో రోహిత్ అరుదైన ఘనత.. ధోనీ తర్వాత ఒకే ఒక్కడిగా..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఉత్కంఠభరిత మ్యాచెస్ జరుగుతున్నాయి. ప్రతి మ్యాచ్ ఆడియన్స్ కి మంచి థ్రిల్ ని కలిగిస్తోంది. ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన ముంబయి- పంజాబ్ మ్యాచ్ కూడా ఐపీఎల్ ప్రేక్షకులకు ఒక మర్చిపోలేని మ్యాచ్ గా నిలుస్తుంది. అయితే అంత స్పెషల్ ఏం జరిగిందని ఆశ్చర్యపోకండి. ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ ఒక చరిత్ర సృష్టించాడు. కాదు చరిత్రలో తనకంటూ ఒక మైలు రాయిని నిర్మించుకున్నాడు. అందుకే ఈ మ్యాచ్ ముంబయి ఆడియన్స్ కి మాత్రమే కాకుండా.. టీమిండియా ఫ్యాన్స్ కి కూడా స్పెషల్ అయిపోయింది. మరి.. రోహిత్ శర్మ సాధించిన ఆ అరుదైన ఘనత ఏంటో చూద్దాం.

ఒక కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా రోహిత్ శర్మ టీమిండియాకి ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అలాగే ముంబయి ఇండియన్స్ కి రోహిత్ శర్మ ఎంత కీలకం అనేది చెప్పేందుకు ఈ ఫీట్ చూస్తే అర్థమైపోతుంది. అసలు విషయం ఏంటంటే.. ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన ముంబయి- పంజాబ్ మ్యాచ్ రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్ లో 250వ మ్యాచ్. ఈ అరుదైన ఘనత సాధించిన ప్లేయర్లు కేవలం ఇద్దరే. మొదటి ఈ ఫీట్ సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ. ఆ తర్వాత ఆ ఘనత సాధించింది ముంబయి ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ. పైగా ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 6500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అలాగే ముంబయి తరఫున అత్యధికి సిక్సులు కూడా నమోదు చేశాడు. రోహిత్ శర్మ పేరు ఐపీఎల్ హిస్టరీలో ప్రత్యేకంగా లిఖించబడుతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Rohith sharma

హిట్ మ్యాన్ ఐపీఎల్ కెరీర్ చూస్తే.. 2008 నుంచి రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ జట్టులోనే కొనసాగుతున్నాడు. సచిన్, పాంటింగ్ తర్వాత ముంబయి ఇండియన్స్ కి ఒక అద్భుతమైన కెప్టెన్ గా రాణించాడు. ముంబయికి దక్కిన ఐపీఎల్ ట్రోఫీలను రోహిత్ శర్మే తీసుకురావడం విశేషం. అలాగే ముంబయి ఇండియన్స్ ఇప్పుడు ఇంత పటిష్టంగా ఉందంటే అందుకు ప్రధాన కారణం కూడా రోహిత్ శర్మానే అని అభిమానులు చెబుతుంటారు. అలాంటి రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగించడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పాండ్యా కెప్టెన్ గా అయినా కూడా ఇంతకాలం తిడుతూనే ఉన్నారు. ముంబయి జట్టు విజయాలు కూడా ఈ సీజన్లో అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఇంక రోహిత్ ఆడిన 250వ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు ముంబయిని బాగానే కట్టడి చేయగలిగింది. కానీ, సూర్య కుమార్ యాదవ్(78), తిలక్ వర్మ(34), రోహిత్ శర్మ(36) చెలరేగడంతో మ్యాచ్ స్కోర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో కూడా హార్దిక్ పాండ్యా నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్ లో హర్షల్ పటేల్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ సామ్ కరణ్ 2 వికెట్లతో శభాష్ అనిపించాడు. కానీ, బ్యాటింగ్ లో మాత్రం పంజాబ్ కింగ్స్ తేలి పోయింది. కేవలం 2.1 ఓవర్లలోనే కేవలం 14 పరుగులే చేసి 4 వికెట్లు కోల్పోయింది. మరి.. రోహిత్ శర్మ సాధించిన ఈ అరుదైన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి