భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాపై ప్రముఖ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఆ ఒక్క పని చేయాల్సిందేనన్నాడు.
భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాపై ప్రముఖ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఆ ఒక్క పని చేయాల్సిందేనన్నాడు.
భారత పేస్ బౌలింగ్ అంటే వరల్డ్ క్రికెట్లో ఒకప్పుడు చిన్నచూపు ఉండేది. టీమిండియా అంటే అందరికీ ముందుగా బ్యాటర్లు, ఆ తర్వాత స్పిన్నర్లు గుర్తుకొచ్చేవారు. మన దేశం ఎప్పటికప్పుడు మంచి బ్యాటర్లు, క్వాలిటీ స్పిన్నర్లను అందిస్తూ వస్తుండటమే దీనికి కారణం. సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ టెండూల్కర్ వరకు బిషన్ సింగ్ బేడీ నుంచి హర్భజన్ సింగ్ వరకు బ్యాటర్లు, స్పిన్నర్లను అందించడంలో మన టీమ్ ఎంతో పేరు మోసింది. ప్రస్తుత క్రికెట్‌ను ఏలుతున్న రారాజు విరాట్ కోహ్లీ, ఈ జనరేషన్లో టాప్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ కూడా టీమిండియా నుంచి వచ్చినోళ్లే.
భారత్ నుంచి లెజెండరీ పేసర్స్ ఉన్నా ఒక యూనిట్‌గా చాన్నాళ్ల పాటు నిలకడగా రాణిస్తూ క్రికెట్లో పెత్తనం చెలాయించింది మాత్రం తక్కువే. అయితే బ్యాటింగ్, స్పిన్‌తో పాటు పేస్ బౌలింగ్‌లోనూ గత దశాబ్ద కాలంగా భారత్ ఎంతో మెరుపడింది. వన్డే వరల్డ్ కప్-2011 నుంచి ఈ మార్పుల్ని గమనించొచ్చు. అప్పటికే టీమ్‌లో సీనియర్లుగా ఉన్న జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా లాంటి వాళ్లు ముందుండి టీమ్‌ను లీడ్ చేశారు. ఆ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవడంతో వీళ్ల పాత్ర ఎంతగానో ఉంది. ఆ తర్వాత కూడా టీమిండియా నుంచి ఎంతో మంది పేసర్లు వచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా భారత పేస్ యూనిట్ కనిపిస్తోంది.
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా రూపంలో నాణ్యమైన పేసర్లు టీమ్‌లో ఉన్నారు. ముఖ్యంగా షమి, బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను గడగడలాడిస్తున్నారు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ కప్‌లో వీళ్లు ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశారో చూశాం. ముఖ్యంగా బుమ్రా అయితే తన బెస్ట్ ఇచ్చాడు. షమి మాదిరిగా ఎక్కువ వికెట్లు తీయకపోయినా బ్యాటర్లను మాత్రం పోయించాడు. బుమ్రాతో డేంజర్ అనే ఉద్దేశంతో అతడి బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడటానికి ప్రత్యర్థి బ్యాటర్లు మొగ్గుచూపారు. అయినా వారిని పెవిలియన్‌కు పంపాడీ పేసుగుర్రం.
బుమ్రా రన్స్ ఇవ్వకుండా స్టార్టింగ్‌లో ప్రెజర్ పెంచడం తర్వాత బౌలింగ్ వేసేవారికి ప్లస్ అయింది. వాళ్లకు వికెట్లు పడ్డాయి. మెగా టోర్నీలో బుమ్రా 18 వికెట్లతో సత్తా చాటాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తీవ్ర ఒత్తిడిలో తన బెస్ట్ ఇవ్వలేకపోయాడు. అతడితో పాటు షమి మరింత బాగా బౌలింగ్ చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో. ఇప్పుడిప్పుడే ఆ ఓటమి బాధలో నుంచి బయటపడుతున్న వీళ్లు నెక్స్ట్ ఆడే సిరీస్‌ల మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాకు ఓ స్టార్ అథ్లెట్ కీలక సూచన చేశాడు. అతడి బౌలింగ్ రనప్ గురించి ప్రముఖ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనకు బుమ్రా బౌలింగ్ అంటే ఎంతో ఇష్టమన్నాడు.
‘బుమ్రా అంటే నాకు చాలా ఇష్టం. అతడి బౌలింగ్ యాక్షన్ వైవిధ్యం. అయితే అతడు మరింత వేగంతో బౌలింగ్ చేయాలంటే రనప్‌ను కాస్త పెంచుకోవాలి. ఒక జావెలిన్ త్రోయర్‌గా ఇలాంటి విషయాలపై మేం చర్చించుకుంటాం. బౌలర్లు తమ రనప్‌ను కాస్త వెనక్కి నుంచి మొదలుపెడితే మరింత పేస్‌తో బంతుల్ని సంధించొచ్చు. నాకు బుమ్రా స్టైల్ ఇష్టం’ అని నీరజ్ చోప్రా చెప్పాడు. నీరజ్ మాట బుమ్రా వింటాడో లేదో చూడాలి. ఒవేళ ఆ టిప్ ఫాలో అయి పేస్ పెరిగితే మాత్రం బుమ్రాను ఆపడం కష్టమనే చెప్పాలి. మరి.. బుమ్రాకు నీరజ్ ఇచ్చిన బౌలింగ్ టిప్ సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Team India: బీసీసీఐని నిలువునా ముంచిన ప్రముఖ సంస్థ.. ఏకంగా రూ.కోట్లలో ఎగవేత!
Neeraj Chopra said, “I like Jasprit Bumrah and his style. I find his action unique, I feel he should lengthen his run-up to add more pace”. pic.twitter.com/MwjsOlacow
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 4, 2023