iDreamPost

AP మధ్యాహ్న భోజన పథకంపై జపాన్ వాసుల ప్రశంసలు!

  • Published Dec 30, 2023 | 4:00 PMUpdated Dec 30, 2023 | 4:00 PM

అప్పుడపుడు విదేశీయులు ఇండియాను సందర్శిస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఇండియాలో ఉన్న ఫేమస్ ప్లేస్ లను విసిట్ చేస్తూ.. వాటికి తగిన కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. అయితే, తాజాగా ఇండియాను విసిట్ చేసిన కొంతమంది విదేశీయులు ఏకంగా ఏపీ సీఎం జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు.

అప్పుడపుడు విదేశీయులు ఇండియాను సందర్శిస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఇండియాలో ఉన్న ఫేమస్ ప్లేస్ లను విసిట్ చేస్తూ.. వాటికి తగిన కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. అయితే, తాజాగా ఇండియాను విసిట్ చేసిన కొంతమంది విదేశీయులు ఏకంగా ఏపీ సీఎం జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు.

  • Published Dec 30, 2023 | 4:00 PMUpdated Dec 30, 2023 | 4:00 PM
AP మధ్యాహ్న భోజన పథకంపై జపాన్ వాసుల ప్రశంసలు!

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మధ్యాహ్న భోజన పథకం సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఆధ్వర్యంలో జగనన్న గోరు ముద్ద కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. మధ్యాహ్న భోజన కార్యక్రమంలో విద్యార్థులకు రోజుకు ఒక మెనూతో మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. దీని వలన ఎంతో మంది విద్యార్థులు పౌష్ఠిక ఆహారాన్ని తినగలుగుతున్నారు. అయితే, ఈ క్రమంలో కొంతమంది విదేశీయలు ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అంతే కాకుండా అక్కడ ప్రతిరోజు జరిగే మధ్యాహ్న భోజన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. దీనితో అక్కడి వాతావరణాన్ని.. ఆ ఆహారాన్ని గమనించిన విదేశీయులు.. దీనిని అమలుపరిచిన జగన్ పై ప్రశంసలు కురిపించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అది చిత్తూరు జిల్లా యాదమరి మండలం కె. గొల్లపల్లె ప్రభుత్వ పాఠశాల. ఈ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు కనకాచారి. అయితే, ఇతనికి జపాన్ కు చెందిన స్టాన్లీ అనే స్నేహితుడు ఉన్నాడు. కనకాచారి కోరిక మేరకు స్టాన్లీ అతని స్నేహితులతో కలిసి క్రిస్టమస్ వేడుకులకు ఇండియాకు వచ్చారు. సాధారణంగా విదేశీయులు ఇండియాకు వస్తే .. ప్రాచుర్యం చెందిన ప్రదేశాలను సందర్శించి.. వాటికీ సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ.. వాటి గురించి ప్రశంసిస్తారు. కానీ ఇక్కడ ఈ విదేశీయలు గొల్లపల్లె ప్రభుత్వ పాఠశాలను కూడా సందర్శించారు. ఈ క్రమంలోనే ఆ పాఠశాలలో అమలు అవుతున్న కొన్ని పథకాల గురించి తెలుసుకుని ఆశ్చర్య పోయారు. అక్కడ జరుగుతున్న మధ్యాహ్న భోజన కార్యక్రమం వారిని బాగా ఆకర్షించింది. దీనితో ఈ కార్యక్రమాన్ని అంత సవ్యంగా చేస్తున్నది ఎవరని డీటెయిల్స్ అడగడం ప్రారంభించారు.

అప్పుడు ఈ కార్యక్రమాలన్నీ సీఎం జగన్ అమలులోకి తీసుకు వచ్చారని అక్కడి ఉపాధ్యాయులు వీరితో చెప్పారు. అంతే కాకుండా, నాడు- నేడు కార్యక్రమం అమలులోకి వచ్చిన తర్వాత.. అక్కడి పరిస్థితులు అన్ని చక్కబడ్డాయని. కనకాచారి వారికి అన్ని వివరంగా తెలియజేశారు. దానితో పాటు అక్కడి మధ్యాహ్న భోజనాన్ని కూడా వారికి రుచి చూపించారు. ఆ ఆహారాన్ని రుచి చూసిన జపాన్ వాసులు జగన్ ను మెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. ” వాట్ ఆ గ్రేట్ మెనూ.. యువర్ సీఎం కేరింగ్ ఈజ్ సూపర్ ఆన్ మిడ్ డే మీల్స్” అంటూ పొగడ్తల వర్షంతో ముంచెత్తారు. వీరితో పాటు అక్కడి ఉపాధ్యాయుల పని తీరును కూడా వారు మెచ్చుకున్నారు. ఏదేమైనా , మిడ్ డే మీల్స్ ప్రోగ్రాంతో జగన్ విద్యార్థులకు రోజుకు ఒక మెనూతో మంచి ఆహారాన్ని అందిస్తున్నారని చెప్పి తీరాలి. మరి, జపాన్ వాసులు సైతం ఈ కార్యక్రమాన్ని మెచ్చుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి